Revanth Reddy: అప్పుడు అన్నవారంతా ఇప్పుడు లెక్కపెట్టుకుంటున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లంతా.. ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్కపెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే... ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా వస్తున్నారని అన్నారు.

Revanth Reddy: అప్పుడు అన్నవారంతా ఇప్పుడు లెక్కపెట్టుకుంటున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2024 | 3:56 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లంతా.. ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్కపెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే… ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా వస్తున్నారని అన్నారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్సే అభివృద్ధి చేసిందన్నారు. తెలంగాణను బీఆర్‌ఎస్‌ అప్పులకుప్పగా మార్చిందని.. తాము ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వెళ్తున్నామని రేవంత్ అన్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు, ఫార్మా ఇండస్ట్రీతో పాటు.. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు తెచ్చింది కాంగ్రెస్సేనన్నారు. గత పాలకులు డ్రగ్స్‌, గంజాయి తెచ్చారంటూ విమర్శించారు.

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్‌గూడలో కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తాటివనంలో ఈత మొక్కలను నాటిన సీఎం రేవంత్‌ రెడ్డి.. గీత కార్మికుల రక్షణ కోసం తయారు చేసిన కాటమయ్య సేఫ్టీ కిట్స్‌ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. సేఫ్టీ కిట్స్‌ పనితీరుపై కల్లు గీత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని లీటర్ల కల్లు గీస్తారని కార్మికులను ప్రశ్నించారు. బెల్టు షాపుల వల్ల కల్లు వ్యాపారానికి ఇబ్బంది ఉందా అని సీఎం కార్మికులను అడిగారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులకు అద్భుత ప్రచార నైపుణ్యం ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి గౌడ సోదరులు ప్రచారం చేశారని.. తెలంగాణ ప్రభుత్వ పదవుల్లో గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ అన్నారు.

కల్లు గీస్తూ గౌడ సోదరులు ప్రమాదాలకు గురవుతున్నారని సీఎం రేవంత్ అన్నారు.. గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్ తయారు చేయించిందని.. ఈ సేఫ్టీ కిట్ ద్వారా ఇకపై ఏ ఒక్క కార్మికుడు ప్రమాదానికి గురయ్య అవకాశం ఉండదని ఆయన అన్నారు.

వీడియో చూడండి..

రోజు రోజుకీ కులవృత్తులు అంతరించిపోతున్నాయని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ప్రోత్సాహం లేక వివిధ కుల వృత్తుల వారి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నారని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల వృత్తులు చేస్తున్న వారి ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తోందని రేవంత్ అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో తాటి, ఈత చెట్లు పెంచి గౌడ సోదరులకు అండగా ఉంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీలంక తరహాలో తాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి కల్లు గీత కార్మికుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు