Telangana: అద్భుతం..! వ్యర్థాలతో ‘స్మార్ట్‌ బయో ఫర్టిలైజర్‌ అప్లైయర్‌’ రూపొందించిన విద్యార్థి!

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏదైనా వినూత్న ఆలోచనలు, కొత్త ఆవిష్కరణ, ఉత్పత్తులకు సంబంధించి రూపొందించిన ప్రాజెక్టుకు మంచి గుర్తింపు కూడా వస్తోంది. తాజాగా ఇలాంటి ప్రయోగం చేసిన ఓ విద్యార్థి అన్నదాతలకు అండగా నిలిచాడు.

Telangana: అద్భుతం..! వ్యర్థాలతో 'స్మార్ట్‌ బయో ఫర్టిలైజర్‌ అప్లైయర్‌' రూపొందించిన విద్యార్థి!
Smart Bio Fertilizer Applicator
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jul 14, 2024 | 2:19 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏదైనా వినూత్న ఆలోచనలు, కొత్త ఆవిష్కరణ, ఉత్పత్తులకు సంబంధించి రూపొందించిన ప్రాజెక్టుకు మంచి గుర్తింపు కూడా వస్తోంది. తాజాగా ఇలాంటి ప్రయోగం చేసిన ఓ విద్యార్థి అన్నదాతలకు అండగా నిలిచాడు.

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చైతన్య పదో తరగతి చదువుతున్నాడు. చదువులో చురుకుగా ఉండే చైతన్య సైన్స్ ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో పాల్గొన్నాడు. తన తండ్రితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంలో బిజీగా ఉంటూ పంటలు పండించడంలో శ్రమిస్తున్నారు. ముఖ్యంగా విత్తనాలు వేసే సమయంతో పాటు, మొక్కల మొదళ్లలో రైతులు ఎరువులు వేస్తుంటారు. ఇది శ్రమతో కూడిన పని. వయసు మళ్ళిన రైతులు ఈ పని చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొక్కల మొదళ్లలో వేసేలా తక్కువ ఖర్చుతో స్మార్ట్‌ బయో ఫర్టిలైజర్‌ అప్లైయర్‌ను రూపొందించాడు విద్యార్థి పల్లె చైతన్య.

ఇటీవల జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో తాను రూపొందించిన స్మార్ట్‌ ఫర్టిలైజర్‌ అప్లైయర్‌ను ప్రదర్శించారు. వయసు ఎక్కువ ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు యూరియా, పొటాష్, ఇతర ఫర్టిలైజర్, ఘన, ద్రవ పదార్థాలు మొక్కలకు వేయడానికి ఎక్కువగా కష్టపడకుండా సులువుగా వేసేలా పరికరాన్ని రూపొందించాడు. తమ పరిసరాల్లో దొరికే వస్తువులను వినియోగించి ప్రాజెక్టును తయారు చేశారు. గైడ్‌ టీచర్‌ పి.శ్రీరాములు సూచనలతో రూపొందించిన ఈ ప్రాజెక్టుతో జిల్లా స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతల నుంచి మెప్పు పొంది రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైంది.

ఒక ఖాళీ డబ్బాను భుజానికి వేసుకునేలా చేసి దానికి బెల్టులు ఏర్పాటు చేశారు. అదే డబ్బాకు ఒక చోట నుంచి పొడవైన పైపునకు వాల్‌ను అమర్చారు. దీని ద్వారా చెట్టు మొదలు వద్ద పెద్దగా ఇబ్బంది లేకుండా ఎరువులు, రసాయనాలు సులువుగా వేసుకునేలా చైతన్య దీనిని రూపొందించాడు. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో రూపొందించిన ఈ ప్రాజెక్టును వర్చువల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో ప్రదర్శించగా.. చైతన్యను పలువురు అభినందించారు. తన తండ్రితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రివేళల్లో మొక్కలకు ఎరువులు రసాయనాలు వేయడంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ పరికరాన్ని రూపొందించాలని చైతన్య చెబుతున్నాడు. ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..