Warangal: వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి హత్య.

Warangal: వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి హత్య.

Anil kumar poka

|

Updated on: Jul 14, 2024 | 7:07 PM

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు. ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరంగా పెట్టారనే కక్షతోనే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తల్లి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు. ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరంగా పెట్టారనే కక్షతోనే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తల్లి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. యువతి కుటుంబం ఆరుబయట నిద్రిస్తుండగా అర్థరాత్రి తల్వార్‌తో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో అమ్మాయికి, ఆమె సోదరుడికి తీవ్రగాయాలైయ్యాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతలతండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. గిర్నిబాయికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ చింతలతండా దీపిక కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు.

తాను ప్రేమించిన యువతి తన నుంచి విడిపోవడానికి యువతి తల్లిదండ్రులే కారణమని, మా ఇద్దరినీ విడదీశారని కోపంతో ప్రియుడు నాగరాజు ఆ కుటుంబంపై కక్షపెచ్చుకున్నాడు. అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో తల్వార్ తో దాడికి పాల్పడ్డాడు.. మంచం లో ఇంటి బయట నిద్రిస్తున్న కుటుంబంపై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి బానోతు శ్రీనివాస్ నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీపిక, ఆమె సోదరుడు మదన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమ వ్యవహారం కుటుంబాన్ని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ప్రస్తుతం ఆ ఉన్మాది పరారీలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.