Telangana: యూనివర్సిటీల్లో నూరు శాతం ప్రక్షాళన షురూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

చాన్సలర్ పోస్టులకు ఎటువంటి ప్రభావం లేకుండా, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపికలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్, వీసీలకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు

Telangana: యూనివర్సిటీల్లో నూరు శాతం ప్రక్షాళన షురూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Cm Revanth Reddy Mets Vice Chanceloors
Follow us
Prabhakar M

| Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2024 | 3:16 PM

ఉన్నత విద్యా మండలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించారు. గడిచిన పదేళ్లలో ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించడం అవసరం అని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్తగా నియమితులైన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డితోపాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

చాన్సలర్ పోస్టులకు ఎటువంటి ప్రభావం లేకుండా, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపికలు జరిపినట్లు సీఎం స్పష్టం చేశారు. చైర్మన్, వీసీలకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. గతంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీసీల మాదిరిగా, నేటి వీసీలు కూడా విద్యారంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.

యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలని, అవసరమైతే కన్సల్టెన్సీల సేవలు పొందాలని సూచించారు. వర్సిటీలకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను పెంచే చర్యలను చేపట్టాలని సలహా ఇచ్చారు. వీసీలకు స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని చెప్పారు. అయితే, తప్పు జరిగితే తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సైతం వీసీలపై ఉంచారు.

ముఖ్యంగా యూనివర్సిటీలలో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాంటి విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. యూనివర్సిటీలను నూతన దిశగా తీసుకెళ్లడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి పునాదులు వేయాలని విసిలకు సూచించారు సీఎం.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!