AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రియల్టర్‌ రమేష్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరార్‌

కర్ణాటక పోలీసులు పోచారం కారిడార్ పరిధిలోని బృందావనం హోటల్లో బస చేశారు. అక్కడి నుండి కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ తో సహా ప్రధాన నిందితుడు రానా హోటల్ నుండి తప్పించుకొని పరారయ్యాడు. అనంతరం కర్ణాటక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో ఈ ఉదాంతం అంతా వెలుగులోకి వచ్చింది.

Hyderabad: రియల్టర్‌ రమేష్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరార్‌
Accused Rana Escape
Peddaprolu Jyothi
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 02, 2024 | 3:34 PM

Share

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త హత్య కేసులో కీలకమైనటువంటి ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌కు సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకువచ్చినటువంటి కర్ణాటక పోలీసులు ఒక హోటల్లో బస చేశారు ..అయితే ఆ హోటల్ నుంచి కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి అంకూర్ రానా అనే నిందితుడు పరారయ్యాడు.. పోచారం కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్ణాటక కానిస్టేబుల్..దీంతో ఈ కేసుకు సంబంధించినటువంటి అసలు విషయాలు బయటకు వచ్చాయి…

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  హైదరాబాదులో అతన్ని చంపి ఏకంగా కర్ణాటక కు తీసుకువెళ్లారు. అక్కడ ఒక కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు. అయితే దీనిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందగా విచారణలో అసలు విషయం బయటపడింది.

సికింద్రాబాద్ తూకారం గేటుకు చెందిన రమేష్ కుమార్ కుటుంబ కలహాలతో భార్య కూతురును వదిలి పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో మూడేళ్లుగా ఉంటున్నాడు. అయితే రమేష్ 2018లో భువనగిరికి చెందినటువంటి నిహారికను బెంగళూరులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే నిహారిక కూడా పెళ్లై భర్తతో విడిపోయినట్లుగా తెలుస్తోంది. రమేష్ కు అబద్ధాలు చెబుతూ డబ్బులు తీసుకునేది నిహారిక. తను పని చేస్తున్నటువంటి ఐటీ సంస్థ గత సంవత్సరం నుండి జీతం చెల్లించట్లేదు అని చెప్పి గూగుల్ కంపెనీలో పని చేయడానికి జర్మనీ వెళ్లాల్సి ఉందని, అందుకోసం డబ్బులు కావాలని రెండున్నర కోట్లు తీసుకుని వాడేసుకుంది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అదంతా అబద్ధమని తేలింది. దీంతో రమేష్ నిహారికను దూరం పెడుతూ వచ్చాడు.. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని నిహారిక మీద ఒత్తిడి తీసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, అప్పటికే ఏపీలోని కడపకు చెందిన నిఖిల్ రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నిహారిక అతడికి ఈ విషయం అంత చెప్పింది. రమేష్ ను చంపితే అతని ఆస్తి కూడా దక్కించుకోవచ్చు అని చెప్పింది. దీనికి అతను అంగీకరించాడు. నిఖిల్ రెడ్డి మిత్రుడు రాణానికి కూడా ఈ విషయాన్ని చెప్పి ఒప్పించాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన రమేష్ ను కలిసేందుకు ఈనెల 4న సంస్కృతి టౌన్షిప్ కు వచ్చింది నిహారిక. అప్పుడే రానాను జర్మనీలో పనిచేస్తున్న ఎంప్లాయ్ గా చెప్పి రానాను రమేష్ కు పరిచయం చేసింది. ఈ ముగ్గురూ కలిసి కారులో వెళుతుండగా రెండు కోట్లకు సంబంధించిన ప్రస్తవన తీశాడు రమేస్. మనీ ఇష్యూ బయటకు రావడంతో కారులోనే వైరుతో రమేష్ ను హత్య చేశారు రానా, నిహారిక. అనంతరం మృతదేహాన్ని ఒక నిర్మానుష్య  ప్రదేశంలో పడేసి కార్ తో సహా సంస్కృతి టౌన్షిప్ కి వెళ్లారు.  అక్కడ నుంచి కొన్ని విలువైన వస్తువులను తీసుకొని తిరిగి మృతదేహాన్ని కారులో ఎక్కించుకున్నారు. అప్పటికి అక్కడకు చేరుకున్న నిఖిల్ రెడ్డితో సహా ముగ్గురు కలిసి మృతదేహాన్ని తీసుకొని కర్ణాటక  వెళ్లారు. అక్కడ కొడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని కాల్చివేశారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు చేయగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు.  లోతైన విచారణ కోసం ముగ్గురిని అనుమతించింది కర్ణాటక కోర్టు. ఈ క్రమంలోనే సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం హైదరాబాద్ కు వచ్చి కర్ణాటక పోలీసులు పోచారం కారిడార్ పరిధిలోని బృందావనం హోటల్లో బస చేశారు. అక్కడి నుండి కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ తో సహా ప్రధాన నిందితుడు రానా హోటల్ నుండి తప్పించుకొని పరారయ్యాడు. అనంతరం కర్ణాటక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో ఈ ఉదాంతం అంతా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!