AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌యూనిఫామ్‌లో సూర్యనమస్కారాలు.. చిన్నారి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..

ఇదే వీడియోని ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 2500 మందికి పైగా వీడియోను షేర్ చేశారు. 15000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

స్కూల్‌యూనిఫామ్‌లో సూర్యనమస్కారాలు.. చిన్నారి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
Surya Namaskar
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2024 | 8:50 PM

Share

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సోషల్ మీడియా ఖాతాలో ప్రతిరోజూ వివిధ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసే వీడియోలు ఎంతో ఆసక్తికరంగా, అందరికీ స్పూర్తిదాయకంగా ఉంటాయి. కొత్త ఆవిష్కరణలు, ఏదో ఒక రంగంలో చేసిన అద్భుతాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ సారి కూడా అలాంటిదే ఒక అద్భుతమైన వీడియోని షేర్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియో ఓ చిన్నారికి సంబంధించినది. ఆనంద్‌ మహీంద్రా ఆ చిన్నారి పట్ల ఫిదా అయినట్టుగా తెలుస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ డ్రెస్‌లో కనిపిస్తుంది. ఆ చిన్నారి సూర్య నమస్కారాలు చేస్తోంది. ఆమె చేస్తున్న ఒక్కో సూర్య నమస్కార భంగిమ అందరినీ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. అంతేకాదు.. ఆపకుండా, ఎలాంటి శారీరక సమస్య లేకుండా సులువుగా, సునాయసంగా చేస్తోంది. ఇదే వీడియోని ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 2500 మందికి పైగా వీడియోను షేర్ చేశారు. 15000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రణతి బిష్ణోయ్ అని, అమ్మాయి వయసు ఎంత? ఆమె ఎక్కడ నివసిస్తుంది అనే సమాచారం ఏదీ షేర్ చేయబడలేదు. ఆనంద్ మహీంద్రా కొన్ని నిమిషాల ఈ వీడియోను పంచుకున్నారు. నేను కూడా నా ఇంట్లో ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తాను అని రాశారు. కానీ ఆ అమ్మాయి చాలా తేలిగ్గా ఇలా చేస్తోందనిపిస్తోందని రాశారు. వీడియో చూసిన చాలా మంది వినియోగదారులు అమ్మాయికి తమ ఆశీస్సులు అందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.