AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు..

హైదరాబాదులో ఉన్న పలువురు డ్రగ్ కస్టమర్లకు ఈ మత్తు పదార్థాలను సప్లై చేసేందుకే తాను రాజస్థాన్ నుండి వీటిని తీసుకొచ్చినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. మొత్తం 18 లక్షల విలువచేసే 155 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు..
Drugs
Lakshmi Praneetha Perugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 01, 2024 | 7:20 PM

Share

దీపావళి పండుగ రోజు ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విషాదం అంటే ఏదైనా ప్రమాదం జరిగితేనే కాదు.. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య డ్రగ్స్ వివాదం చిచ్చు పెట్టింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ కాలనీలో నివాసం ఉంటున్నాడు రూపారాం అనే సోదరుడు. ఇతడు స్థానికంగా హార్డ్వేర్ షాపులో పనిచేస్తున్నాడు. తన సోదరుడు కృష్ణారాం రాజస్థాన్లో పని చేస్తున్నాడు. తన సొంత ఊరు రాజస్థాన్ అయినప్పటికీ వృత్తిరీత్యా హైదరాబాద్కు వచ్చి రూపా రాం స్థిరపడ్డాడు.

రాజస్థాన్ నుండి వైజాగ్ కు వెళుతున్నాను అంటూ కృష్ణ రామ్ తన సోదరుడు రూప రామ్ కు చెప్పాడు. అయితే మార్గమధ్యలో హైదరాబాదులో తనకు పని ఉందని కుదిరితే తన రూమ్ కి వస్తానని చెప్పాడు. దీంతో సోదరుడి రాక సందర్భంగా రూపారం సంతోషంగా ఉన్నాడు. అయితే ఇదే తరుణంలో గురువారం సాయంత్రం అనుకున్నట్టే కృష్ణారా మ్ తన సోదరుడు ఇంటికి బ్యాగుతో వచ్చాడు. అయితే సోదరుడు వచ్చినప్పటినుండి అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో రూపా రాం తన సోదరుడు బ్యాగ్ తెరిచి చూశాడు.

బ్యాగు తెరిచిన రూపా రాం ఒకసారిగా అవాక్కయ్యాడు. బ్యాగ్ లో ఉన్న వస్తువులు చూసి కంగుతున్నాడు. అచ్చం మత్తు పదార్థాలు లాగా కనిపించడంతో వెంటనే తనకు తెలిసిన పోలీసులకు రూపారం ఫోన్ చేశాడు. తన సోదరుడు కొన్ని మత్తు పదార్థాలతో రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు వచ్చాడని నార్కోటిక్ పోలీసులకు సమాచారం అందించాడు. నార్కోటిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి తన సోదరుడు కృష్ణారాము ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు ఎండిఎంఏ డ్రగ్ ప్యాకెట్లు తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. హైదరాబాదులో ఉన్న పలువురు డ్రగ్ కస్టమర్లకు ఈ మత్తు పదార్థాలను సప్లై చేసేందుకే తాను రాజస్థాన్ నుండి వీటిని తీసుకొచ్చినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. మొత్తం 18 లక్షల విలువచేసే 155 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కృష్ణారాము ను నార్కోటిక్ పోలీసులు చందానగర్ పోలీసులకు అప్పగించారు. అయితే ఇతడి వద్ద ఉన్న కన్స్యూమర్ల లిస్ట్ కోసం కృష్ణారాము ను పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి