పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే..! కాంచన గుహలో కొలువైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇక పాలమూరు జిల్లాలోని సప్త కొండలు నెలరోజుల పాటు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. స్వయంభూవుగా వెలసిన స్వామి వారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. కార్తీకమాసంలో కురుమూర్తి రాయుడిని దివ్య రూపాన్ని దర్శించుకొని కొత్తకుండలో నైవేద్యం సమర్పించి కోర్కెలు కోరుకుంటారు.

పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే..! కాంచన గుహలో కొలువైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ
Kurumurthy Jatara
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 01, 2024 | 6:01 PM

తెలంగాణలో అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో వెలసిన కురుమూర్తి దేవస్థానం. కురుమూర్తి క్షేత్రం పేదల తిరుపతిగా… స్వామివారు పేదల శ్రీవారిగా ప్రఖ్యాతి. ఇక్కడి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమల తలపిస్తుంది. ఇక్కడ కూడా శ్రీవారు ఏడు కొండలను తన ఆవాసంగా మలుచుకున్నాడు. దేవరగట్టుపైనున్న కాంచన గుహలో శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ సమేతంగా స్వయం భువుగా కొలువుదీరి ఉన్నాడు. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతీరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి వేంకటేశ్వర స్వామి మూర్తిని పోలి ఉండటం ఇక్కడ విశేషం.

ఉద్దాల(పాదుకలు) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం:

పాలమూరు ప్రజల ఇలవేల్పు దైవం కురుమూర్తిస్వామి వారు. ఏడు కొండల మధ్య లక్ష్మి సమేతంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 2వ తేది నుంచి 18వ తేది వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తోంది ఆలయ కమిటి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి అలంకరణ, ఉద్దాల మహోత్సవం, స్వామి వారి కళ్యాణం ప్రధాన ఘట్టాలు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి క్షేత్ర ఆవరణ అంతా దుకాణాలు, లక్షలాది భక్తులతో ఎంతో సందడిగా మారుతుంది. ప్రధాన ఘట్టాలతో పాటు, బ్రహ్మోత్సవాలకు సుమారు 10లక్షల మంది వరకు భక్తులు హజరవుతారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల(పాదుకలు) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. ఈ వేడుకలో భాగంగా మొదట పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డేమాన్ గ్రామం వరకు తీసుకువస్తారు. అక్కడే నియమ నిష్ఠలతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానం వరకు తీసుకువస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. శ్రీవారి ఉద్దాలను దర్శిస్తే ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోయి… అంత మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడా నికి రెండు రకాల పురాణగాథలు ఉన్నాయి. ఇందులో… తిరుపతి నుంచి కురుమూర్తికి రా వడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడి కి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రతి ఏడు కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలిరానున్నారు. నెల రోజుల పాటు స్వామివారి జాతర కన్నుల పండువగా సాగుతుంది. దీంతో వచ్చే భక్తుల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు ఆలయ కమిటీ, జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. భద్రత కోసం పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి సీసీ కెమరాలతో పర్యవేక్షించనున్నారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు కాల క్షేపంతో పాటు, వారిని చైతన్య పరిచేందుకు కళాజాతాలు, నాటక ప్రదర్శనలు, సంగీత విభావరులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. భక్తుల పాలిట కొంగుబంగారంగా కురుమూర్తి స్వామి వారు నిలుస్తున్నారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తులు తరలివచ్చి స్వామివారికి దాసంగం సమర్పిస్తారు. కొత్తకుండలో తొలిపంట ధాన్యంతో నైవేద్యం పెడతారు. అనంతరం అక్కడే ఆ రాత్రి బస చేసి…ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. పాలమూరు జిల్లాలోని కొండలలో నెలకొన్న కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు గతేడాది అసెంబ్లీ ఎన్నికలు ఆటంకం కలిగించాయి. దీంతో ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీ కురుమూర్తి స్వామి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతోంది TGSRTC . జాత‌రలో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఉద్దాల ఉత్స‌వం ఈ నెల 8వ తేదిన ఉండ‌గా.. 7 నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు వెళ్తాయి. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ సౌకర్యం కూడా ఉంది.  టికెట్ల బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఉప‌యోగించుకుని సుర‌క్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని ద‌ర్శించుకోవాల‌ని టీజీఎస్ఆర్టీసీ  కోరుతోంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే