- Telugu News Photo Gallery Cluster Beans Health Benefits And Its Side Effects In Telugu Lifestyle News
Cluster Beans : గోరుచిక్కుడు అంటే ఇష్టంలేదా..? ఈ గొప్ప బెనిఫిట్స్ మిస్ చేసుకున్నట్టే..!
గోరు చిక్కుడు కాయలు.. దాదాపు అందరికీ తెలిసిన కూరగాయే..కానీ, దీన్ని తినేందుకు మాత్రం చాలా మంది ఇష్టపడరు. కానీ, గోరుచిక్కుడు వల్ల ఆరోగ్యప్రయోజనాలు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి. గోరు చిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Nov 01, 2024 | 8:06 PM

గోరుచిక్కుడు.. సాధారణంగా ఇది చిక్కుడు జాతికి చెందిన మొక్క. ఇంగ్లీషులో దీన్ని క్లస్టర్ బీన్స్ అంటారు. గోరుచిక్కుడులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి లభిస్తుంది.

గోరుచిక్కుడులోని గుణాలు ఆస్తమాకి చక్కని పరిష్కారంగా ఉంటుంది. కాబట్టి, ఆస్తమా ఉన్నవారు గోరుచిక్కుడుని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఐరన్ లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.

గోరుచిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గోరుచిక్కుడులో ఎన్నో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాల్మొనెల్లో సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గోక్కుడుతో ఒంట్లోని హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ గోరుచిక్కుడు మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే ఫోలెట్ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది. గోరు చిక్కుడు విటమిన్లు, ఖనిజాలకు మూలం. ఇది విటమిన్లు A, C, E, K, B6, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తుంది.

Cluster Beans




