Viral Video: ఓ మై అక్కో.! కట్టెపుల్ల అనుకునేవు.. కింగ్ కోబ్రా అక్కడ.. వీడియో చూస్తే షాకే

సరీసృపాలతో గేమ్స్ ఆడటం ఈ మధ్యకాలంలో యువతకు ఫ్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియా ఫేం కోసం ప్రమాదకరమైన ఆటలు ఆడి ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. కానీ ఈ వీడియో సెపరేటు..

Viral Video: ఓ మై అక్కో.! కట్టెపుల్ల అనుకునేవు.. కింగ్ కోబ్రా అక్కడ.. వీడియో చూస్తే షాకే
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2024 | 8:20 PM

సాధారణంగా అమ్మాయిలు చిన్న పురుగును చూస్తూనే చాలు.. దెబ్బకు దడుసుకుని.. భయంతో పారిపోతుంటారు. అయితే ఇక్కడొక అమ్మాయి చాలా ధైర్యంగా ఒత్తి చేతులతో కింగ్ కోబ్రాను పట్టేసింది. కొందరు యువతులు ప్రమాదకరమైన జంతువులైన పాములు, మొసళ్లతో ఆటలు ఆడుతుంటారు. ఇక ఆ కోవకు చెందినదే ఈ వనిత కూడా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో ఓ యువతి పాముతో పట్టుకోవడం మనం చూడొచ్చు.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కాలేజీ క్యాంపస్‌లోకి పాము దూరడంతో.. అక్కడున్న విద్యార్ధులంతా భయంతో పరుగులు పెడతారు. అయితే ఓ యువతి మాత్రం ఎంతో ధైర్యంతో అక్కడున్న పొదల్లోకి వెళ్లిపోతున్న పామును ఒత్తి చేతులతో తోక పట్టుకుని మరీ బయటకు లాగింది. పాము వదిలించుకోవాలని గింజుకుంటున్నా.. ఆ యువతి ఏమాత్రం భయం లేకుండా.. దాన్ని ఉడుంపట్టు పట్టుకుంటుంది. ఇక ఆ యువతి పామును పట్టుకున్న తీరును చూసి అక్కడున్న విద్యార్ధులంతా దెబ్బకు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..