Hyderabad: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? బాబోయ్.! ప్రాణాలు పోతాయ్.. బీ కేర్‌ఫుల్

అసలు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేవి కొన్ని మాత్రమే. వాటిలో ఇరానీ చాయి, షవర్మా, పానీపూరీలు గుర్తొస్తాయి. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు స్ట్రీట్ ఫుడ్‌కు ఉన్న క్రేజ్ బడా రెస్టారెంట్లకు సైతం ఉండదు.

Hyderabad: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? బాబోయ్.! ప్రాణాలు పోతాయ్.. బీ కేర్‌ఫుల్
చాలా మంది భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకుంటారు. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం వెనుకకు, పైకి కదులుతుంది. తిన్న వెంటనే పడుకునే అలవాటు వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అలాగే కొంతమంది అతిగా తింటారు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అలాగే పేలవమైన జీర్ణక్రియ కడుపు నొప్పికి కారణం కావచ్చు. కాబట్టి నెమ్మదిగా జీర్ణమయ్యే, అసిడిక్ ఫుడ్, బ్రెడ్, స్పైసీ ఫుడ్ జీర్ణమవడం కష్టమైన ఆహారాన్ని వీలైనంత తగ్గించడం మంచిది.
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 02, 2024 | 4:05 PM

దేశంలో హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ స్ట్రీట్ ఫుడ్ అభిమానులే. అయితే తాజాగా బయటపడుతున్న కొన్ని సంచలన విషయాలు స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా జరుపుతున్న దాడుల్లో కీలక అంశాలు బయటపడుతున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫుడ్ తిని ఒక మహిళ మరణించిన ఘటన కూడా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

అసలు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేవి కొన్ని మాత్రమే. వాటిలో ఇరానీ చాయి, షవర్మా, పానీపూరీలు గుర్తొస్తాయి. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు స్ట్రీట్ ఫుడ్‌కు ఉన్న క్రేజ్ బడా రెస్టారెంట్లకు సైతం ఉండదు. అలాంటి స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇటీవల బంజారాహిల్స్‌లో స్ట్రీట్ ఫుడ్ తిని రేష్మ అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

బంజారాహిల్స్‌లోని వారాంతపు సంతలో మొమోస్ కౌంటర్ ఏర్పాటు చేశారు. తన బంధువులతో సహా అక్కడికి వెళ్లి మోమోస్ తిన్న రేష్మ అపస్మారక పరిస్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతూ నిమ్స్ హాస్పిటల్లో మరణించింది. ఆమెతోపాటు momos తిన్న మరో 50 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ మోమోస్ తయారు చేసిన వ్యక్తులను బంజారా హిల్స్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ దగ్గర ఉన్న చింతల బస్తీలో ఒక చిన్న రూమ్‌ని అద్దెకు తీసుకొని momosను తయారు చేస్తారు. వీటి తయారీకి నాసిరకం పదార్థాలు వినియోగించడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో ఇలాంటి స్టాల్స్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

ఇటీవల కొద్ది రోజుల క్రితం షవర్మా తిని దాదాపు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్టోబర్ 22న యూసఫ్ గూడాలోని మండి రెస్టారెంట్‌లో ఈ తనిఖీలు నిర్వహించారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మరో చోట అల్వాల్‌లో షవర్మా తిని మరి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.ఇలా హైదరాబాద్‌‌‌లోని చాలా ప్రాంతాల్లో ఫేమస్‌గా లభించే స్ట్రీట్ ఫుడ్‌లు తిని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!