TGSRTC: శివయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. కార్తీక మాసంలో..

కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఒక శుభవార్త తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. తాజాగా హైదరాబాద్ లోని బస్ భవన్ లో నిర్వహించిన

TGSRTC: శివయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. కార్తీక మాసంలో..
TGSRTC
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2024 | 5:15 PM

ప‌విత్ర కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు గాను తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు గాను భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ తెలిపారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మ‌పురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుతున్నామని ఆయన శనివారం తెలిపారు.

పలు ఆంశాలపై శనివారం హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం వంటి అంశాల‌పై చర్చించారు. ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు.

మరీ ముఖ్యంగా ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణ‌మి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్ర‌త్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పంచారామాల‌కు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వివ‌రించారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని తెలిపారు.

ఇక అద్దె ప్రాతిపదిక అందించే ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు సజ్జనర్‌ తెలిపారు. ప‌ల్లె వెలుగు కిలోమీట‌ర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిల‌క్స్ రూ.8, సూప‌ర్ ల‌గ్జ‌రీ రూ.6, రాజ‌ధాని రూ.7 మేర త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల‌కు, శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!