Telangana: పేరుకే మారుమూల పల్లె కానీ.. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే..!

అక్కన్నపేట గ్రామంలో 1,010 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 4,545. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా ఆ ఊరిలో ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు.

Telangana: పేరుకే మారుమూల పల్లె కానీ.. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే..!
Akanapet
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2024 | 4:40 PM

మెదక్ జిల్లాలో ఉన్న వందలాది గ్రామాల్లో అక్కన్నపేట గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామం ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్​ అడ్రస్‌గా మారింది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని ప్రేరణగా తీసుకుని సర్కారు ఉద్యోగాలు సాధించారు. ఊరిలో దాదాపు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అందులో ఎక్కువ మంది టీచర్లు ఉండటం విశేషం. కొన్ని ఫ్యామిలీల్లో భార్యా భర్తలు ఇద్దరూ టీచర్​ ఉద్యోగాలు సాధించారు. ప్రతీ డీఎస్సీలోనూ ఈ ఊరి అభ్యర్థులు ప్రతిభ చూపి టీచర్​ ఉద్యోగాలకు సెలక్ట్​ అవుతుండటం మరో విశేషం.

అక్కన్నపేట గ్రామంలో 1,010 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 4,545. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా ఆ ఊరిలో ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామంలో మొత్తం 174 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం. పంచాయతీరాజ్​ శాఖలో పది మంది పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తుండగా, ఫారెస్ట్​, పోస్టల్​, ఆర్టీసీ తదితర డిపార్ట్‌మెంట్​లలో ఉద్యోగులు ఎంపిక య్యారు.ఎక్కువ శాతం టీచర్లే.

గ్రామంలో అన్ని వర్గాల వారు ఉన్నారు. వారు వీరనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు, అందులోనూ సొసైటీలో గౌరవ ప్రదమైన టీచర్లుగా స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతీ డీఎస్సీలోను ఐదారుగురు టీచర్ పోస్టులు సాధిస్తుండటం విశేషం. 2008 డీఎస్సీలో అక్కన్నపేట గ్రామానికి చెందిన 18 మంది టీచర్లుగా సెలక్ట్​ అయి రికార్డు నెలకొల్పారు. గడచిన 20 ఏళ్లలో 50 మంది టీచర్​ ఉద్యోగాలు సాధించారు. 2024 డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో ఇద్దరు సెలెక్ట్​ కాగా, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ విభాగంలో ఓ అభ్యర్థి జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. గ్రామంలో పీజీ, బీఎడ్​, డీఎడ్​ పూర్తి చేసిన వాళ్ళు 200 మందికి పైగా ఉన్నారు. వారిలో చాలా మంది టీచింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. 15 మంది ప్రైవేట్​ స్కూళ్లలో టీచర్లుగా, కాలేజీ లెక్చరరర్లుగా పని చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..