AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ సర్కార్‌ శుభవార్త..! నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్‌లు కొన్న పేదలకు.. త్వరలోనే..

ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ సర్కార్‌ శుభవార్త..! నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్‌లు కొన్న పేదలకు.. త్వరలోనే..
Lrs For Plots
Ashok Bheemanapalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 19, 2025 | 9:40 PM

Share

సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ (భూ క్రమబద్ధీకరణ పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

పేద ప్రజలు, గత నాలుగు సంవత్సరాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించి నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా పలు వెసలుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని, వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..