తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై రాజకీయ శత్రువులు..!
ఇప్పటివరకు వరకు కూడా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుల మాటల యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పరిధి దాటి ఆరోపణలు... కుటుంబాలపై కూడా బురద జల్లడాలు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు రాజకీయ శత్రువులు ఒకే వేదికపై షేక్ అండ్ ఇచ్చుకుంటే, నవ్వుతూ పలకరించుకుంటే.. ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు ఇలా ఇద్దరి మధ్య ప్రతిరోజు ఏదో ఒక వాదన. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఆసక్తికరంగా ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అది కూడా ఒకే అంశానికి మద్దతు ఇస్తూ…
శుక్రవారం(మార్చి 21) జరగబోయే సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు హాజరవుతారు. పార్లమెంట్ నియోజకవర్గల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు శుక్రవారం ఉదయం బయలుదేరి చెన్నై చేరుకుంటారు. అక్కడ జరిగే సౌత్ ఇండియా జేఏసీ సమావేశంలో ఒకే వేదికపై ఇద్దరు కూర్చుంటారు. అదే స్పీచ్‌పై షేక్ అండ్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది.
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి గళం విప్పనున్నారు. ఒకే అంశానికి మద్దతిస్తూ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతున్న ఒక వేదిక ఇప్పటివరకు ఇదే మొదటిది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. సౌత్ ఇండియా జేఏసీ స్టేజ్‌పై చెన్నైలో ఇద్దరు పలకరించుకుంటారా..? షేక్ అండ్ ఇచ్చుకుంటారా..? ఇద్దరు ప్రసంగాల్లో ఒకరి పేరు ఒకరు తీసుకుంటారా? ఇలా చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు వరకు కూడా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుల మాటల యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పరిధి దాటి ఆరోపణలు… కుటుంబాలపై కూడా బురద జల్లడాలు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు రాజకీయ శత్రువులు ఒకే వేదికపై షేక్ అండ్ ఇచ్చుకుంటే, నవ్వుతూ పలకరించుకుంటే.. ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..