CM KCR: ఖమ్మం ఖిల్లాపై సీఎం కేసీఆర్ నజర్.. 18న ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఖమ్మం బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఖమ్మం బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో ఖమ్మం నేతలతో భేటీ అయిన సీఎం కేసీఆర్ సభ గురించి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 18న 5 లక్షల మందితో బీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలకు ఆహ్వానం పంపారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు సైతం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభను సక్సెస్ చేసేందుకు ప్లాన్ ను వివరించారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇటీవలి జరిగిన పరిణామాలపైనా ఆరా తీశారు. అయితే, ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదు.
18న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభ సక్సెస్ అయ్యేలా నేతలకు యాక్షన్ ప్లాన్ వివరించినట్లు తెలుస్తోంది. అదేరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ చేరుతుండటం, అదేవిధంగా అమిత్ షాను కలుస్తున్నారన్న వార్తలు.. మరోవైపు కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
