Telangana CM Kcr: టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 350 మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం..

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ..

Telangana CM Kcr: టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 350 మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 30, 2020 | 4:24 PM

Telangana CM Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ఉద్యగ సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో ముచ్చటించనున్నారని, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. కాగా, ఈ భేటీ సందర్భంగా టీఎన్జీవో నాయకులకు అక్కడే భోజనం ఏర్పాటు చేశారు. ఆ మేరకు ప్రగతి భవన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. పలు చోట్ల ముఖ్యమంత్రి చిత్ర పటానికి ఉద్యోగులు పాలాభిషేకాలు నిర్వహించారు.

Also read:

Onion prices to come down: కొత్త సంవ‌త్స‌రంలో దిగి రానున్న ఉల్లి ధ‌ర‌లు..! కార‌ణం ఇదేనా…?

TDP Leader Murder: టీడీపీ నేత నందం సుబ్బయ్యను మేమే హత్య చేశాం.. పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయిన ముగ్గురు నిందితులు..