Onion prices to come down: కొత్త సంవ‌త్స‌రంలో దిగి రానున్న ఉల్లి ధ‌ర‌లు..! కార‌ణం ఇదేనా…?

Onion prices to come down: దేశంలో ఉల్లి ఎగుమ‌తిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ గ‌త రెండు రోజుల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే...

Onion prices to come down: కొత్త సంవ‌త్స‌రంలో దిగి రానున్న ఉల్లి ధ‌ర‌లు..! కార‌ణం ఇదేనా...?
Follow us

|

Updated on: Dec 30, 2020 | 2:50 PM

Onion prices to come down: దేశంలో ఉల్లి ఎగుమ‌తిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ గ‌త రెండు రోజుల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో ఉల్లి రైతుల‌కు మంచి శుభ‌వార్త చెప్పిన‌ట్ల‌యింది. గ‌త కొన్నినెల‌ల కింద‌ట భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఉల్లి భారీగా న‌ష్ట‌పోయింది. ఉల్లి స‌ర‌ఫ‌రాలో సైతం తీవ్ర ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో ఉల్లి ధ‌ర‌లు కిలో రూ.200పైగా ప‌లికింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. కేంద్రం వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఉల్లి ఎగుమ‌తుల‌పై ఆంక్ష విధించ‌డంతో పాటు వివిధ దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంది. దీంతో ఉల్లి ధ‌ర‌లు క్ర‌మంగా దిగి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం కిలోకు రూ.25 నుంచి రూ.30 వ‌ర‌క‌కు ధ‌ర‌ర ప‌లుకుతోంది.

ఈ సారి పంట రావ‌డం, దిగుమ‌తులు పెర‌గ‌డంతో ఉల్లి ఎగుమ‌తుల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉల్లి ఎగుమ‌తిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించింది. 2021 జ‌న‌వ‌రి 1 నుంచి అన్ని ర‌కాల ఉల్లిని ఎగుమ‌తి చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఉల్లి ధ‌ర‌ను అదుపు చేసేందుకు విదేశాల‌కు ఉల్లి విత్త‌నాల ఎగుమ‌తిని త‌క్ష‌ణ‌మే నిషేధిస్తూ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఫార‌న్ ట్రేడ్ సెప్టెంబ‌ర్ 15న ఆదేశాలు జారీ చేసింది. హోల్ సెల‌ర్ల వ‌ద్ద 25 ట‌న్నులు, రిటైల‌ర్ల వ‌ద్ద 2 ట‌న్నుల‌కు మించి ఉల్లి నిల్వ‌లు ఉండ‌రాద‌ని ఇది వ‌ర‌కే కేంద్రం ఆంక్ష‌లు విధించింది.

కాగా, ఏపిల్ – జూలై నుంచి ఉల్లి ఎగుమ‌తులు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా పంట న‌ష్ట‌పోయింది. దీంతో ధ‌ర‌లు పెరిగాయి. అధికారుల వివ‌రాల ప్ర‌కారం.. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశం నుంచి 328 మిలియ‌న్ డాల‌ర్ల ఫ్రెష్ ఉల్లి, 112 మిలియ‌న్ డాల‌ర్ల డ్రైడ్ ఉల్లి ఎగుమ‌తులు జ‌రిగాయి. ఏప్రిల్‌-జూలై 2020లో బంగ్లాదేశ్‌కే ఎగుమ‌తులు 157 శాతం పెరిగాయి. ఇక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో కొత్త ఏడాదిలో ధ‌ర‌లు దిగివ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read: Indian railways new coaches: విమానాన్ని తలపిస్తోన్న ఇండియన్ రైల్వే కొత్త కోచ్‌లు.. ‘ఇకపై రైలు ప్రయాణం మరపురాని జ్ఞాప‌కం’

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో