మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలే వర్షాలు.. పిడుగులు కూడా.!

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి..

మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలే వర్షాలు.. పిడుగులు కూడా.!
Ap Rains
Follow us

|

Updated on: May 07, 2024 | 7:15 PM

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 120.5 మిమీ, రాజమహేంద్రవరంలో 92 మిమీ, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5 మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5 మిల్లీ మీటర్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లా ఆలమూరులో 73 మిమీ అధికవర్షపాతం నమోదైందన్నారు. 20మిమీ నుంచి 64 మిమీ లోపు వర్షపాతం 45 ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపారు. మరో వైపు కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.4°C, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 43.2°C, వైయస్సార్ జిల్లా మద్దూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.9°C, నెల్లూరు జిల్లా మనుబోలు, నంద్యాల జిల్లా మహానందిలో 42.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Latest Articles
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..