Indian railways new coaches: విమానాన్ని తలపిస్తోన్న ఇండియన్ రైల్వే కొత్త కోచ్‌లు.. ‘ఇకపై రైలు ప్రయాణం మరపురాని జ్ఞాప‌కం’

Indian railways new coaches: ఇకపై భారత రైల్వే కోచ్‌లు విమానాన్ని తలపించనున్నాయి. అత్యంత సౌకర్యవంతంగా, అధునాతనంగా రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో భాగంగా...

Indian railways new coaches: విమానాన్ని తలపిస్తోన్న ఇండియన్ రైల్వే కొత్త కోచ్‌లు.. ‘ఇకపై రైలు ప్రయాణం మరపురాని జ్ఞాప‌కం’
Follow us

|

Updated on: Dec 30, 2020 | 2:33 PM

Piyush tweet about new railway coaches: ఇకపై భారత రైల్వే కోచ్‌లు విమానాన్ని తలపించనున్నాయి. అత్యంత సౌకర్యవంతంగా, అధునాతనంగా రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో భాగంగా భారతీయ రైల్వే శాఖ తాజాగా ‘విస్టాడోమ్’ టూరిస్టూ కోచ్‌లకు సంబంధించిన స్పీడ్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. గంటకు సుమారు 180 కి.మీల వేగాన్ని తట్టుకునేలా రూపొందించడం ఈ కోచ్‌ల ప్రత్యేకత.

ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు.. ‘ఈ కొత్త కోచ్‌లు ప్రయాణికులకు ప్రయాణాన్ని కేవలం జర్నీలా కాకుండా మరిచిపోలేని ఒక మరుపురాని జ్ఞాప‌కంగా మార్చనున్నాయి. భారత రైల్వే ప్రవేశపెట్టనున్న కొత్త కోచ్‌లను ఓసారి చూడండి’ అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ కొత్త కోచ్‌లకు సంబంధించి ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కొత్త కోచ్‌ల ప్రత్యేకతలు.. ఇండియన్ రైల్వే ప్రవేశ పెట్టనున్న ఈ విస్టాడోమ్ కోచ్‌లలో భారీ స్థాయిలో అద్దాలు (విండోస్) ఉంటాయి. దీంతో ప్రకృతి అందాలను వీక్షిస్తూ ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణికులు తాము వెళ్లే రూట్‌కు సంబంధించిన లొకేషన్‌ను ఈ కోచ్‌లలో రియల్ టైమ్‌లో చూడొచ్చు. ఒక్కో కోచ్‌లో 44 సీట్లు ఉండగా.. వీటిని 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ కొత్త కోచ్‌లను ప్రస్తుతానికి దాదర్. దాద‌ర్‌-మ‌డ‌గావ్‌, అర‌కు లోయ‌, క‌శ్మీర్ లోయ‌, డార్జిలింగ్ హిమాల‌య‌న్ రైల్వే, క‌ల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేర‌న్ హిల్ రైల్వే, నీల‌గిరి మౌంటేన్ ప్రాంతాల్లో న‌డ‌ప‌నున్నారు.

Also read: Vijayawada Mumbai Flight: జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య ‘ఇండిగో’ విమాన సర్వీసులు..

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..