Lower Voter Turnout: పోలింగ్ శాతానికి ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధం ఉందా? గతానుభవాలు ఏం చెబుతున్నాయి?

దేశంలో మండిపోతున్న ఎండవేడిని మించి వాడివేడిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సంరంభంలో అందరి దృష్టి పోలింగ్ శాతంపైనే ఉంది. పోలింగ్ శాతానికి, ఫలితాలకు లంకె పెడుతూ విశ్లేషణలు సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని కొందరు చెబుతుంటారు.

Lower Voter Turnout: పోలింగ్ శాతానికి ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధం ఉందా? గతానుభవాలు ఏం చెబుతున్నాయి?
Voter Turnout
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 19, 2024 | 7:34 PM

దేశంలో మండిపోతున్న ఎండవేడిని మించి వాడివేడిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సంరంభంలో అందరి దృష్టి పోలింగ్ శాతంపైనే ఉంది. పోలింగ్ శాతానికి, ఫలితాలకు లంకె పెడుతూ విశ్లేషణలు సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని కొందరు చెబుతుంటారు. కొందరేమో ఓటర్లు ప్రదర్శించే నిరాసక్తత కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని సూత్రీకరిస్తుంటారు. ఈ విశ్లేషణలకు తగ్గట్టే కొన్ని ఫలితాలు కూడా ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పర్వంలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల్లో నమోదైన పోలింగ్ శాతం గతం కంటే తక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఎన్నికల ప్రక్రియపై మరీ నిరాసక్తత ప్రదర్శించడం సరికొత్త చర్చకు కారణమయ్యాయి. తొలి 4 విడతల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019తో పోల్చితే స్వల్పంగా తక్కువ. గత లోక్‌సభ ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 543 నియోజకవర్గాల్లో దాదాపు 70 శాతం నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. మిగతా 3 విడతల్లో ఇంకో 163 నియోజకవర్గాలు మాత్రమే మిగిలున్నాయి.

తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్న రాష్ట్రాల్లో బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇకపై జరగబోయే మిగతా 3 విడతల్లోనైనా భారీగా పోలింగ్ శాతం నమోదయ్యేలా చూడాలని ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు పశ్చిమ బెంగాల్, అస్సాం, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదవుతోంది.

చరిత్ర ఏం చెబుతోంది?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే సంతృప్తికరమైన పోలింగ్ శాతం నమోదు కాలేదు. 1951-52 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17,32,13,635 మంది ఓటర్లలో 8,86,12,171 మంది మాత్రమే పార్లమెంటుకు జరిగిన మొదటి ఎన్నికలలో ఓటు వేశారు. అంటే 51.15 శాతం మంది ఓట్లు వేశారు. దేశ మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ సుకుమార్ సేన్ ఈ పోలింగ్ శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో దాదాపు సగం మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటే, అది అసలు సిసలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించదని పలువురు ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు.

తొలినాళ్లలో దేశంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండడం, అప్పటి వరకు ఎన్నికలు అంటే ఎవరికీ తెలిసి ఉండకపోవడం వల్ల తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని భావించినప్పటికీ.. ఆ తర్వాత కూడా పెద్దగా పురోగతి కనిపించలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా సరే, పోలింగ్ శాతంలో పెరుగుదల లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్న అంశంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం సగటును లెక్కిస్తే 59.1గా తేలింది.

1980ల నుంచి ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం సగటు 61.8 శాతం. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విప్లవం మొదలైన తొలినాళ్లలో జరిగిన 1999 ఎన్నికల్లోనూ 59.99 శాతం పోలింగ్ నమోదవగా, 2004లో 58.07 శాతం, 2009లో 58.21 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అక్షరాస్యతలో వృద్ధి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటికీ 60 శాతం మార్కును అధిగమించకపోవడం గమనార్హం.

కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను పరిశీలిస్తే.. 20వ శతాబ్దంలో జరిగిన 13 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 5 పర్యాయాలు మాత్రమే పోలింగ్ 60 శాతాన్ని మించి నమోదైంది. 1967లో 61.04 శాతం, 1977లో 60.49 శాతం, 1984-85లో 64.01 శాతం, 1989లో 61.95%, 1998లో 61.97% (ఎలక్టోరల్ స్టాటిస్టిక్స్ పాకెట్ బుక్, 2021 ప్రకారం) నమోదైంది. ఆ తర్వాత జరిగిన 1999, 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 60 శాతం కంటే తక్కువగానే నమోదైంది.

21వ శతాబ్దం ప్రారంభంలో దేశంలోని ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు వచ్చాయి. 1980ల చివరి నాటికి ఎన్నికల పరిశీలకులు చట్టపరమైన హోదాను పొందారు. బూత్ క్యాప్చరింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు ఎన్నికలను వాయిదా వేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చింది. ఎన్నికల చట్టాలతో పాటు అనుబంధ చట్టాల్లోనూ సవరణలు జరిగాయి. రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాల వివరాలను ప్రకటించడం తప్పనిసరిగా మారింది.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు దూర్‌దర్శన్ (DD), ఆలిండియా రేడియో (AIR) ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సమాన సమయాన్ని కేటాయించడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితాను ఉచితంగా పంపిణీ చేయడం కోసం చట్టపరమైన ఏర్పాట్లు జరిగాయి. 2004లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) అమల్లోకి వచ్చాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ సమయంలో కనీస సదుపాయాల కల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అనేక చర్యలు చేపట్టింది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కనీస వసతులు, అన్ని పోలింగ్ బూత్‌లు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేలా తప్పనిసరి చేయడం, వికలాంగులకు పికప్ అండ్ డ్రాప్ సదుపాయం, 85 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్ అవకాశం కల్పించడం వంటి మరికొన్ని సంస్కరణలు ఈ మధ్యకాలంలో అమల్లోకి వచ్చాయి. మొత్తంగా గత లోక్‌సభ ఎన్నికల్లో (2019) పోలింగ్ శాతం అత్యధికంగా 67.40 శాతంకు చేరుకుంది.

పోలింగ్ శాతం.. ప్రభుత్వ వ్యతిరేకత

ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం దేశంలో నమోదైన సగటు పోలింగ్ శాతం కంటే ఎక్కువే. కాకపోతే గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా తక్కువ. ఇంకో 3 విడతల పోలింగ్ ముగిసేసరికి ఇది మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కొద్ది తేడాను ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చూడలేమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదైనప్పుడే కాదు, అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు మారిన ఉదంతాలున్నాయి. 1999తో పోల్చితే అటూ ఇటూగా 2 శాతం పోలింగ్ తక్కువే నమోదైనప్పటికీ.. 2004లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) అధికారంలోకి వచ్చింది.

2009లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినా సరే యూపీఏ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. 2014లో ప్రభుత్వం మారి బీజేపీ సారథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధికారంలోకి రాగా.. 2019లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని సాధించింది. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్ శాతంలో హెచ్చుతగ్గులు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా విశ్లేషించలేమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని అర్థమవుతోంది.

ఇకపోతే పోలింగ్ శాతం తగ్గడానికి అధిక ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ వంటి వాతావరణ పరిస్థితులు కూడా కారణమని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పంట కాలం ఆలస్యమవడం, రైతులు, రైతు కూలీలు పొలం పనులు వదిలి పోలింగ్‌కు రాలేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. బిహార్ వంటి రాష్ట్రాల్లో వలసల ప్రభావం కూడా పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల నుంచి మొదలుపెట్టి అనేక రకాల కార్మిక ఉద్యోగాల కోసం బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వలస వెళ్తున్నారు. కేవలం తమ ఓటు కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి స్వస్థలాలకు చేరుకునే పరిస్థితి వారికి ఉండదు. ఇలాంటివి కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణమవుతున్నాయి. పట్టణ ప్రాంత వాసులు వారాంతాల్లో పర్యాటక, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఒకవేళ ఆ తేదీల్లోనే పోలింగ్ ఉంటే, వారంతా కూడా పోలింగ్‌కు దూరమవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే పోలింగ్ శాతంలో హెచ్చుతగ్గులకు కారణమని చెప్పలేమని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా నమోదైన పోలింగ్ శాతం ఆధారంగా ఎన్నికల ఫలితాలను ఊహించుకోవడం లేదా అంచనా వేసుకోవడం సరికాదు. దీన్ని ఆధారంగా చేసుకుని భారీ మొత్తంలో బెట్టింగులకు పాల్పడేవారు ఎదురుదెబ్బలు తినడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!