కుంకుమ పువ్వుతో సమస్యలకు యముడు..
TV9 Telugu
25 July 2024
కుంకుమ పువ్వులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.
తరుచూ కుంకుమ పువ్వును తీసుకుంటే ఆకలి కోరికను నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది. అధిక బరువు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.
కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది బాధపడేవారికి మేలు జరుగుతుంది.
అలాగే దీన్ని పాలతో తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు ప్రమాదం తగ్గుతుందన్నది నిపుణులు మాట.
సోరియాసిస్ సమస్యకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు మెరుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు తొలగిపోవడానికి సహాయపడతాయని అంటున్నారు వైద్యులు.
కుంకుమ పువ్వు లోని పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తాయి.
పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే ఔషధ గుణాల కారణంగా ఋతుస్రావ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి