AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnudu: కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు ఫ్యామిలీ.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే చేస్తానన్న శ్యామలమ్మ

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదులు సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, రాజకీయాలకు రెండింటికీ దూరంగా ఉన్నారు. ఆయన చివరిగా 2019 లో హల్ చల్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్న కృష్ణుడు ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు.

Krishnudu: కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు ఫ్యామిలీ.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే చేస్తానన్న శ్యామలమ్మ
Krishnudu, Shyamala Devi
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 9:48 PM

Share

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కృష్ణుడు కూడా ఒకరు. దీని తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అతను వినాయకుడు సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదులు సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, రాజకీయాలకు రెండింటికీ దూరంగా ఉన్నారు. ఆయన చివరిగా 2019 లో హల్ చల్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్న కృష్ణుడు ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయన భార్య గాయత్రి మరొకరితో కలిసి చీరల వ్యాపారం ప్రారంభించారు. జరివరం అనే పేరు మీద శుక్రవారం (జులై 26)న హైదరాబాద్‌ లో స్టోర్ ఓపెన్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్ కి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి, పలాస, ఆపరేషన్ రావణ్ సినిమాల హీరో రక్షిత్ అట్లూరి, అలాగే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అతిథులుగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. అనంతరం అభిలాష రెడ్డి, గాయత్రిలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తన కుమారుడి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘జరివరం స్టోర్ కు నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు పర్సనల్ గా పట్టు చీరలు అంటే చాలా ఇష్టం. కృష్ణంరాజు గారు నాకు కొన్న ఫస్ట్ చీర కంచి పట్టు చీరనే. ఈ స్టోర్ లో ఆ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ పెళ్లి దుస్తులు కూడా ఈ జరివరం స్టోర్ నుంచే కొంటాను’ అని చెప్పుకొచ్చారు శ్యామలమ్మ. ఇదే సందర్భంగా మేయర్ గద్వాల విజయ లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఇక్కడ కలెక్షన్స్ బాగున్నాయి. లేడీస్ కు ఇక్కడి కలెక్షన్స్ చాలా బాగా నచ్చుతాయనుకుంటున్నాను. మ్యారేజ్ డ్రెస్ లే కాకుండా ఫాన్సీ డ్రెస్సులు కూడా ఈ స్టోర్ లో ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇక నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. ‘అభిలాష రెడ్డి, నా భార్య గాయత్రి కలసి ఈ జరివరం స్టోర్ స్టార్ట్ చేశారు. ఈ కలెక్షన్స్ కోసం వాళ్లు చాలానే కష్టపడ్డారు. హైద్రాబాద్ లో మహిళలకు మంచి కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ జరివరం స్టోర్ మొదలుపెట్టారు. మమ్మల్ని ఆశీర్వదించేందుకు ఇక్కడకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!