తన ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేసిన లేడీ సూపర్ స్టార్ నయన్..
Anil Kumar
26 July 2024
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని.. ఆ స్థాయి సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది లేడీ బాస్ నయనతార.
మొన్నీమధ్య పెళ్లి తరువాత అటు భర్త ఇటు ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తోంది ఈ అమ్మడు.
మలయాళం ఇండస్ట్రీ నుండి ఎంట్రీ ఇచ్చి.. సౌత్‌లో అన్ని భాషల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంది.
అగ్రహీరోలు అందరి సరసన ఆడిపాడింది. షారుక్ తో వచ్చిన జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన మార్క్ చూపించింది.
అయితే తాజాగా తన ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే పోషకాహారాన్ని ఇంట్లో వండించుకుని తింటున్నట్టు తెలిపారు నయనతార.
ఈ మధ్య కాలంలో జంక్ పదార్థాల మీద కోరిక కలగడం లేదని.. ఇంటి భోజనం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కూడా చెప్పారు.
అంతే కాకుండా మన లైఫ్‌స్టైల్ మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని.. అది ఫుడ్ తో కూడా ముడిపడి ఉంటదని అన్నారు.
సహజంగా మంచి ఆహారంతో మంచి ఆరోగ్యం అంటూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి