బెంగళూరులో ఉన్నారా.. అథెంటిక్ కర్ణాటక ఫుడ్స్ ట్రై చెయ్యండి..

TV9 Telugu

19 May 2024

కూర్గ్ పాండి కర్రీ అనేది కర్నాటక సంప్రదాయ పద్ధతిలో పంది మాంసంతో చేసిన కూర. కర్ణాటక-శైలి మసాలాలు, సుగంధాలు ఉపయోగించి చేస్తారు.

బెన్నె మసాలా దోస అనేది కర్నాటకలోని ప్రసిద్ధి చెందిన దోస. కర్ణాటక వీధుల్లో చాలా ప్రసిద్ధమైన, ప్రాథమిక ఆహారం.

డోన్ బిర్యానీ అనేది కర్ణాటక సిగ్నేచర్ బిర్యానీ, ఇది బాస్మతి బియ్యం వలె కాకుండా సాధారణ బియ్యంతో తయారు చేయబడుతుంది.

బిసి బేలే బాత్ అనేది పప్పు బియ్యంతో చేసిన కర్నాటక ఖిసిడి. 100 ఏళ్ల నాటి ఖిచిడి రకం కర్ణాటక వంటకాలన్నింటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది.

భత్కాలి బిర్యానీ మరొక సిగ్నేచర్ కర్ణాటక స్టైల్ బిర్యానీ, ఇది తీరప్రాంత కర్ణాటకలోని భత్కల్ పట్టణంలోని నవయత్ ముస్లిం సంఘం నుండి ఉద్భవించింది.

కొర్రి గస్సీ అనేది మంగళూరు స్టైల్ చికెన్ కర్రీ, కాల్చిన మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలు మరియు క్రీము కొబ్బరి పాలతో తయారు చేయబడింది.

కుందాపుర కోలి సారూ సిగ్నేచర్ చికెన్ కర్రీని మీరు తప్పకుండా రుచి చూడాలి. ఇది రుచికరమైన మంగళూరు-శైలి చికెన్ గ్రేవీ.

కర్నాటకలో బాగా పాపులర్ అయిన స్వీట్, మైసూర్ పాక్. శెనగపిండి, నెయ్యి, పంచదారతో తయారు చేయబడుతుంది. ఇది అన్ని స్వీట్ దుకాణాల్లో దొరుకుతుంది.