Indian boy: భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
సాధారణంగా చాలామంది ఆటోల్లోనో, లేక ఎక్కడైనా షాపులకు వెళ్లినప్పుడు, లేదంటే రోడ్డుమీద వెళ్తున్నప్పుడు తమ వస్తువులను పోగొట్టుకుంటుంటారు. ఇవి దొరికినప్పుడు కొందరు ఎంతో నిజాయితీగా వాటిని పోగొట్టుకున్నవారి అడ్రస్ తెలుసుకొని వారికి అందేలా చేస్తారు. లేదంటే పోలీసులకు అప్పగిస్తారు. తాజాగా దుబాయ్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటనకు వచ్చన ఓ విదేశీ టూరిస్ట్ తన వాచ్‌ను పోగొట్టుకున్నాడు.
సాధారణంగా చాలామంది ఆటోల్లోనో, లేక ఎక్కడైనా షాపులకు వెళ్లినప్పుడు, లేదంటే రోడ్డుమీద వెళ్తున్నప్పుడు తమ వస్తువులను పోగొట్టుకుంటుంటారు. ఇవి దొరికినప్పుడు కొందరు ఎంతో నిజాయితీగా వాటిని పోగొట్టుకున్నవారి అడ్రస్ తెలుసుకొని వారికి అందేలా చేస్తారు. లేదంటే పోలీసులకు అప్పగిస్తారు. తాజాగా దుబాయ్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటనకు వచ్చన ఓ విదేశీ టూరిస్ట్ తన వాచ్‌ను పోగొట్టుకున్నాడు. అది దొరికిన భారతదేశానికి చెందిన బాలుడు దానిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. బాలుడి నిజాయితీకి మెచ్చి సర్టిఫికెట్‌తో బాలుడిని సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను దుబాయ్ పోలీసు శాఖ ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది.
ముహమ్మద్ అయాన్ యూనిస్ అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రితో కలసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ కు ఓ వాచ్ కనిపించింది. దాన్ని తీసుకొని సమీపంలోని పోలీసు స్టేషన్ లో అప్పగించాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు వాచ్ పోగొట్టుకున్నట్లు వెల్లడైంది. స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వాచ్ ను తిరిగి అతనికి పంపే ఏర్పాటు చేశారు. అలాగే తనకు దొరికిన వాచ్ ను నిజాయతీగా అప్పగించినందుకు బాలుడిని ప్రశంసిస్తూ ఓ అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్, కెప్టెన్ షహాబ్ అల్ సాదీ పాల్గొన్నారు. యూఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు, పోలీసులు అమలు చేసే భద్రతా ప్రమాణాలకు ఇదో నిదర్శనమని దుబాయ్ పోలీసు శాఖ ‘ఎక్స్’లో పేర్కొంది. యూనిస్ నిజాయతీని నెటిజన్లు ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.