Wearing Helmet in Car: ట్రాఫిక్ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ సిటీ వీధుల్లో ఓ కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రోడ్డుమీద ఆ కారు కనిపిస్తే అంతా దానివైపే చూస్తున్నారు. అలాగని అదేమీ ప్రత్యేకమైన కారు కాదు.. కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని నడుపుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
గత మార్చి నెలలో ఓ రోజు బహదుర్ సింగ్ సెల్ ఫోన్ కు ట్రాఫిక్ చలానా మెసేజ్ వచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందుకు .వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు అందులో ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో తాను టూవీలర్ ఎప్పుడు నడిపానా అని బహదుర్ ఆశ్చర్యపోయాడు. ఇదేదో పొరపాటున వచ్చిన మెసేజ్ కావొచ్చనే ఉద్దేశంతో యూపీ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేశాడు. అందులో కూడా తన ఆడి కారు నెంబర్ తోనే చలానా ఇష్యూ అవడం, చలానాలో స్పష్టంగా మోటార్ కార్ అని మెన్షన్ చేయడం చూసి అవాక్కయ్యాడు. కారులో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేశానని తనకు ఫైన్ విధించడంతో ట్రాఫిక్ పోలీసులపై బహదుర్ తీవ్రంగా మండిపడ్డాడు. వాళ్ల నిర్వాకం పదిమందికీ తెలియాలని, తనకు ఫైన్ వేయడంపై నిరసన తెలిపేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు మీడియాకు వివరించాడు. ఆపై హెల్మెట్ సరిచేసుకుని కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

