తెలుగు రాష్ట్రాల్లోని ఐకానిక్ పానీయాలు..

TV9 Telugu

19 May 2024

ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రిలో రోజ్ మిల్క్. చాలా ప్రసిద్ధమైన రోజ్ వాటర్ ఫ్లేవర్ పాల పానీయం. రాజమండ్రి వెళ్తే తప్పక ప్రయత్నించాలి.

ఆంధ్ర ప్రదేశ్ స్థానికులు మెంతులు, మజ్జిగ ఉపయోగించి మెంతి మజ్జిగ అనే రుచికరమైన మజ్జిగ పానీయాన్ని తయారు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లోని అరకులో కాఫీ ఒక్కసారైన తాగాలి. రియల్ కాఫీ టేస్ట్ కోసం దీన్ని ప్రయత్నించండి. దీని రుచిని చూస్తే అస్సలు వదిలిపెట్టారు.

100 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరి డ్రింక్ ఆర్టోస్ తప్పుగా తాగాల్సిందే. దీని అద్భుతమైన రుచి మరో డ్రింక్ కి రాదు.

గోదావరి జిల్లాలు, వైజాగ్, కాకినాడ వంటి కొన్ని తీర ప్రాంతాల్లో చాలా కాలంగా తయారు చేయబడిన గోలీ సోడాలకు ప్రసిద్ధి చెందాయి.

తాటి చెట్ల నుండి తాజాగా తీసుకున్న పచ్చి పానీయం కల్లు. ఇది వాస్తవానికి కొన్ని ఆరోగ్య సమస్యలకు మంచిది. ఇది ఆంధ్ర, తెలంగాణాల్లో దొరుకుతుంది.

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఫలూదా ఓర్ రూహ్-అఫ్జా వేసవి కాలంలో తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఇది మండే ఎండ నుండి మీకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.

తెలంగాణాలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం ఇరానీ చాయ్. తెలంగాణావాసులకు ముఖ్యంగా హైదరాబాదీలకు ఇరానీ చాయ్‌పై ఉన్న ప్రేమ ఎనలేనిది.