Monsoons: ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులు , ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటూ ఇటూగా మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత భారతదేశ భూభాగమంతా విస్తరిస్తాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన తాజా ప్రకటనలో వెల్లడించింది. అయితే, నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ వెల్లడించింది.

Monsoons: ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

|

Updated on: May 19, 2024 | 2:59 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులు , ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటూ ఇటూగా మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత భారతదేశ భూభాగమంతా విస్తరిస్తాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన తాజా ప్రకటనలో వెల్లడించింది. అయితే, నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ వెల్లడించింది. కాగా వ్యవసాయాధారిత భారత ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా నాలుగు నెలలపాటు వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవనుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. కేరళను తాకి.. ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే దాదాపుగా నెల సమయం పడుతుంది. అంటే.. జూలై 15 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు ఆవరిస్తాయి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి ఇండియన్ ఓషియన్ డైపోల్ – ఐవోడీ ప్రస్తుతం ‘తటస్థంగా’ ఉంది. ఆగస్టు నాటికి సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకల్లా కేరళను ఋతుపవనాలు తాకితే.. మరో వారం పది రోజుల్లో.. అంటే జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ఏపీని పలకరిస్తాయి. ఆ తర్వాత క్రమంగా విస్తరించి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. తాజా అంచనాల బట్టి చూస్తే.. తెలంగాణకు కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us