Rashmika Mandanna:భయపెట్టేందుకు రెడీ అయిన నేషనల్ క్రష్.. హారర్ కామెడీలో రష్మిక..
ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక నటిస్తున్న పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హిందీలో 'ముంజ్యా' చిత్రం ఇటీవల విడుదలై విజయాన్ని అందుకుంది.