విశ్వంభర తర్వాత హరీష్ శంకర్ సినిమా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరిదశకు రావడం.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో.. చిరంజీవి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు హరీష్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.