లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

|

Updated on: Jun 25, 2024 | 6:23 PM

మహిళలకు సంబంధించి కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది. మహిళల హక్కులు, వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆ దేశం గర్భవిచ్ఛిత్తిపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

మహిళలకు సంబంధించి కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది. మహిళల హక్కులు, వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆ దేశం గర్భవిచ్ఛిత్తిపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు యూఏఈ అధికారిక మీడియా సంస్థ ‘ది నేషనల్‌’ కథనం వెల్లడించింది. ఈ తీర్మానం ప్రకారం.. అత్యాచారం లేదా వివాహేతర సంబంధం వల్ల మహిళలు గర్భం దాల్చితే దాన్ని తొలగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అత్యాచార ఘటనను లేదా అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు చెప్పాలి. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి తీసుకురావాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కల్పించారు. అది కూడా మహిళ ప్రాణానికి ఎలాంటి ముప్పు రాదని నిర్ధారించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా.. యూఏఈ లో కనీసం సంవత్సరం నుంచి ఉంటున్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం యూఏఈ చట్టాల ప్రకారం.. అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే జీవిత ఖైదు విధిస్తారు. అదే బాధితురాలు 18 ఏళ్లలోపు అమ్మాయి లేదా దివ్యాంగురాలైతే నేరస్థులకు మరణశిక్ష వేస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి

జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??

Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్

Follow us
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..