Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

Phani CH

|

Updated on: Jun 25, 2024 | 6:17 PM

అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తమ హీరో ఎదురు పడితే వారి ఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు.

అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తమ హీరో ఎదురు పడితే వారి ఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు. ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రయాణాల్లోనే జరుగుతుంటాయి. తాజాగా స్టార్ హీరో అక్కినేని నాగార్జున విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అది కాస్తా వైరల్ అయి.. విమర్శలు రావడంతో.. తాజాగా నాగార్జున ఈ ఘటన విచారం వ్యక్తం చేశారు. అభిమానికి సారీ చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని, ఆయనను షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫోటో దిగేందుకు ముందుకు వచ్చాడు. అయితే క్షణాల్లో అలర్టయిన నాగార్జున సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని పక్కకు లాగేశాడు. దీంతో ఆ ఫ్యాన్‌ కిందపడిపోయాడు. ఇది గమనించని నాగార్జున తన దారిలో తను నడుచుకుంటూ వెళ్లిపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్