రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??
దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి.. కుటుంబం నుంచి తనకు వారసత్వంగా దక్కిన ఆస్తుల పునఃపంపిణీకి ముందుకొచ్చారు. వాటి విలువ ఏకంగా 224 కోట్ల రూపాయలు ఉండటం గమనార్హం. మార్లిన్ ఎంగెల్‌హార్న్.. ఆస్ట్రియా దేశంలోని ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. ఆమెకు వారసత్వంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి. అయితే, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించిన ఆమె..
దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి.. కుటుంబం నుంచి తనకు వారసత్వంగా దక్కిన ఆస్తుల పునఃపంపిణీకి ముందుకొచ్చారు. వాటి విలువ ఏకంగా 224 కోట్ల రూపాయలు ఉండటం గమనార్హం. మార్లిన్ ఎంగెల్‌హార్న్.. ఆస్ట్రియా దేశంలోని ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. ఆమెకు వారసత్వంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి. అయితే, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించిన ఆమె.. దాదాపు తన సంపద మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా విభిన్న రంగాల నిపుణులతో కూడిన ఓ బృందాన్ని సంప్రదించారు. సంపద పునఃపంపిణీపై ఆ బృందం తన ప్రణాళికలతో ముందుకొచ్చింది. దేశంలోని దాదాపు 77 సంస్థలకు ఆ సంపదను పంచుతామని తెలిపింది. వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, స్త్రీ-పురుష సమానత్వానికి కృషి చేసే సంస్థలు, మహిళా ఆశ్రయ కేంద్రాలు, నిరాశ్రయులు నడిపించే వార్తాపత్రికలు, అగ్నిమాపక విభాగాలు, ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపింది. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సంపద పునఃపంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను కొంతమేర రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఇలా చేయడం అద్భుతంగా అనిపిస్తోందని ఆమె చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే
తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి
జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??
Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్
TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్