ఇంజినీరింగ్‌ విద్యార్ధుల సృష్టి.. నేతల బాధ్యతలు గుర్తుచేసే కుర్చీ

Phani CH

|

Updated on: Jun 24, 2024 | 7:44 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఐటీఎం ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు రాజకీయ నాయకులకు వారి బాధ్యతను గుర్తుచేసే అద్భుతమైన కుర్చీని రూపొందించారు. కృత్రిమమేధ తో పనిచేసే ఈ మ్యాజికల్‌ చైర్‌పై నాయకులు కూర్చోగానే ఎన్నికల సమయంలో వారు చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తుంది. ఫస్టియర్‌ విద్యార్థులు అన్షిత్‌ శ్రీవాస్తవ, ప్రణవ్‌ శర్మ, మన్వేంద్ర త్రిపాఠి దీన్ని తయారు చేశారు. ఈ కుర్చీని సామాజిక మాధ్యమాలకు అనుసంధానం చేశారు. ఇందులో.. ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజలు వ్యక్తం చేసిన మంచి లేదా చెడు అభిప్రాయాలనుబట్టి కుర్చీలో ఏర్పాటుచేసిన ఎరుపు, ఆకుపచ్చ లైట్‌ ఇండికేటర్ల ద్వారా ఆయా నేతల పనితీరును అంచనా వేస్తామని ప్రణవ్‌ తెలిపాడు. కుర్చీకి సెన్సర్లు అమర్చామని, ముందుగా ఈ కుర్చీలో కూర్చొన్న నాయకుడు ఎవరనేది అది గుర్తిస్తుంది. తర్వాత నేతలకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంది. వారికున్న ప్రజాదరణ, ప్రజల అసంతృప్తి అన్నీ బయటపెడుతుంది. ఈ కుర్చీ కోసం ఒక ఆండ్రాయిడ్‌ మొబైల్, ఎరుపు, ఆకుపచ్చ సూచికలు, కేబుల్, ఫైబర్‌ కుర్చీ, పీసీబీ బోర్డు, బ్యాటరీ మొదలైనవి ఉపయోగించామని విద్యార్థులు తెలిపారు. ఈ ఏఐ ఛైర్‌ భవిష్యత్తులో మరింత స్మార్ట్‌గా మారనుంది. రూ.35 వేలు వెచ్చించి 15 రోజుల్లో దీనిని రూపొందించిన విద్యార్థుల కృషిని గోరఖ్‌పుర్‌లోని మదన్‌మోహన్‌ మాలవీయ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ ఎన్‌కే సింగ్‌ ప్రశంసించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్విస్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల నగదు నిల్వలు

ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 అంటే అర్థం ఏంటి ??

రక్తాన్ని సహజ పద్ధతుల్లో శుద్ధి చేసే ఆహారాలు..

పరీక్షల్లో స్టూడెంట్‌ రాసిన జవాబుకు టీచర్‌ షాక్‌

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే