Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే

Phani CH

|

Updated on: Jun 24, 2024 | 4:39 PM

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా మనిషి ఆరోగ్యానికి రకరకాల పండ్లు తినమని సూచిస్తుంటారు. అయితే సహజసిద్ధంగా పండిన పండ్లతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఏ పండ్లూ సహజసిద్ధంగా పండినవి లభించడంలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అడవిలో సహజసిద్ధంగా లభించే అద్భుతమైన ఔషధ ఫలం నెక్కెర కాయలు. ఇవి కాస్త జిగురు తత్వాన్ని కలిగి ఉండటం వలన వీటిని బంక నెక్కెర కాయలు అంటారు.

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా మనిషి ఆరోగ్యానికి రకరకాల పండ్లు తినమని సూచిస్తుంటారు. అయితే సహజసిద్ధంగా పండిన పండ్లతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఏ పండ్లూ సహజసిద్ధంగా పండినవి లభించడంలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అడవిలో సహజసిద్ధంగా లభించే అద్భుతమైన ఔషధ ఫలం నెక్కెర కాయలు. ఇవి కాస్త జిగురు తత్వాన్ని కలిగి ఉండటం వలన వీటిని బంక నెక్కెర కాయలు అంటారు. ఇంగ్లీషులో గ్లూ బెర్రీస్గా పిలువబడే ఈ పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. సహజంగా 40 ఏళ్లు పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు సహజంగా వస్తుంటాయి. అలాంటివారు ఈ బంకనెక్కర పండ్లు తింటే మోకాలిలో గుజ్జు తయారు అయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. కండరాల క్షీణతకు ఈ పండు అద్భుతమైన ఔషధంగా చెబుతారు. షుగర్‌, బీపీని కంట్రోల్‌ చేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ నేచురల్‌ ఫ్రూట్‌ మేల్‌ సెక్స్‌ పవర్‌కు చాలా బాగా పనిచేస్తుందట. ఇక ఈ చెట్టు ఆకులు కూడా ఔషధమే అంటున్నారు. ఈ ఆకులు మెత్తగా నూరి తలకు అప్లై చేస్తే మైగ్రేన్‌ సహా అన్నిరకాల తలనొప్పులూ తగ్గుతాయని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొనకల్ల సుధా తెలిపారు. అలాగని వీటిని అతిగా కూడా తినకూడదట.. తినడానికి కొంచెం వగరుగా ఉన్నప్పటికీ గ్లూ బెర్రీ ఫ్రూట్స్ మనుషుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండుగ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ గ్లూ బెర్రీ పండ్లు అంటే అడవిలో ఎలుగు బంట్లు చాలా ఇష్టంగా తింటాయట. చెట్టు కింద ఈ పండ్ల తొక్కలు పడి ఉన్నాయంటే…ఆ ప్రాంతంలో ఎలుగు బంటి ఉందని గిరిజనులు గుర్తిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిన్న తిండి అరగడంలేదా.. ఇలా చేయండి

రీల్స్ పిచ్చి తో భవనంపై నుంచి వేల్లాడిన యువతి.. నెట్టింట వీడియో వైరల్

ముఖేశ్ అంబానీ వీడియో వైరల్‌.. మోసపోయిన డాక్టర్

స్పృహ వచ్చి చూసే సరికి అమ్మాయిగా మారిన అబ్బాయి