తిన్న తిండి అరగడంలేదా.. ఇలా చేయండి
వర్షాకాలం ప్రారంభమైనా చాలా చోట్ల ఇంకా మండే ఎండలు తగ్గడం లేదు. విపరీతమైన వేడికారణంగా తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీనికి తోడు డీహైడ్రేషన్ సమస్య కూడా వెంటాడుతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ఓ గ్లాసు కీరదోస షర్బత్ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, శరీరం కూడా తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు. కీర దోస జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.. అందుకే చాలా మంది కీర దోస భోజనంతో పాటు తీసుకుంటారు.
వర్షాకాలం ప్రారంభమైనా చాలా చోట్ల ఇంకా మండే ఎండలు తగ్గడం లేదు. విపరీతమైన వేడికారణంగా తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీనికి తోడు డీహైడ్రేషన్ సమస్య కూడా వెంటాడుతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ఓ గ్లాసు కీరదోస షర్బత్ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, శరీరం కూడా తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు. కీర దోస జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.. అందుకే చాలా మంది కీర దోస భోజనంతో పాటు తీసుకుంటారు. లేదంటే భోజనం తర్వాత అయినా సలాడ్‌గా తింటారు. ఈ కీర దోసతో బాడీ కూలింగ్ షర్బత్‌ను తయారు చేసుకుంటే జీర్ణసమస్యలు ఇట్టే మాయం అవుతాయి. ఇందుకోసం.. తరిగిన కీర దోస ముక్కలు, నిమ్మకాయ, నీరు, రుచికి సరిపడా చక్కెర, కొద్దిగా అల్లం, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. కీర దోస పరిమాణం కొంచెం ఎక్కువే ఉండాలి. ఉదాహరణకు 250 మిల్లీలీటర్ల నీటికి కనీసం 2 మీడియం సైజు కీర దోస కాయలు తీసుకోవాలి. ముందుగా కీర దోస బాగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీర దోస పొట్టు లేకుండా చూసుకోవాలి. నిమ్మకాయ తొక్కను కూడా తీసెయ్యాలి. ఇప్పుడు నీళ్ళు, కీర దోస, నిమ్మకాయలను కలిపి బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో అల్లం, కాస్తింత ఉప్పు, చక్కెరను కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాస్త చల్లగా మారిన తర్వాత గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇది రుచిగా ఉండటంతోపాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. పైగా శరీరంలో నీటి సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య చికత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ పిచ్చి తో భవనంపై నుంచి వేల్లాడిన యువతి.. నెట్టింట వీడియో వైరల్
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

