రీల్స్ పిచ్చి తో భవనంపై నుంచి వేల్లాడిన యువతి.. నెట్టింట వీడియో వైరల్
యువత రీల్స్ పిచ్చి వ్యసనంగా మారుతోంది. తామేం చేస్తున్నామో, అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందోననే స్పృహ లేకుండా రీల్స్ చేయడంలో మునిగిపోతున్నారు. ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా షార్ట్ వీడియో చిత్రీకరణ కోసం ఓ యువతి మరో యువకుడి సాయంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో భవంతిపై నుంచి వేలాడింది.
యువత రీల్స్ పిచ్చి వ్యసనంగా మారుతోంది. తామేం చేస్తున్నామో, అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందోననే స్పృహ లేకుండా రీల్స్ చేయడంలో మునిగిపోతున్నారు. ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా షార్ట్ వీడియో చిత్రీకరణ కోసం ఓ యువతి మరో యువకుడి సాయంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో భవంతిపై నుంచి వేలాడింది. ఈ వీడియో నెట్టింట కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి, ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది. తమ పిడికిలి శక్తి ఎంత ఉందో పరీక్షించేందుకు యువతీయువకులు ఈ ప్రాణాంతక స్టంట్‌కు పూనుకున్నారు. ఓ యువకుడు యువతి చేయి పట్టుకుని భవనంపై నుంచి 100 అడుగుల ఎత్తున వేలాడదీశాడు. పూణెలోని స్వామి నారాయణ్ టెంపుల్‌లో రీల్‌ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ స్టంట్‌ను అన్ని కోణాల నుంచి చిత్రీకరించేందుకు వారు ఏకకాలంలో పలు కెమెరాలను కూడా వినియోగించారు. ఒకరు మేడ పైనుంచి, మరొకరు నేలపై నిలబడి రికార్డు చేశారు. మరోవ్యక్తి, యువతిని పట్టుకున్న యువకుడి పక్కనే బోర్లాపడుకుని వీడియోను రికార్డు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రాణాపాయం కలిగేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేరం కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

