స్పృహ వచ్చి చూసే సరికి అమ్మాయిగా మారిన అబ్బాయి
ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే సినిమాటిక్ ప్రేమకథలు తరచూ వింటుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వాటన్నింటికీ మించి ప్రవర్తించాడో ఉన్మాది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అదీ అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇచ్చి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడితో ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు.
ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే సినిమాటిక్ ప్రేమకథలు తరచూ వింటుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వాటన్నింటికీ మించి ప్రవర్తించాడో ఉన్మాది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అదీ అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇచ్చి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడితో ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్ష చేయిస్తానంటూ ఓంప్రకాశ్ జూన్ 3న మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలన్నారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి పురుష అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యులతో కలిసి నాటకమాడి ఓంప్రకాశ్ ఈ తతంగమంతా నడిపాడు. స్పృహలోకి వచ్చిన యువకుడు లబోదిబోమంటూ తన కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పాడు. బాధితుడి తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓంప్రకాశ్‌ను అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనలో నిందితుడితో పాటు సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలకు రైళ్లలో ఉన్న సదుపాయాలు ఏంటో తెలుసా ??
రూ.90 వేల మామిడిపండుతో దేవుడికి నైవేద్యం
ఈ పొడిని నూనెలో కలిపి రాయండి.. క్షణాల్లో తెల్ల జుట్టు నల్లగా
ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము
విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!

షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. చివరికి

12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే

అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు...వీడియో

మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో

ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్ వచ్చినా అదే రూల్.. వ

ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో

సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే
