మహిళలకు రైళ్లలో ఉన్న సదుపాయాలు ఏంటో తెలుసా ??

ఈరోజుల్లో చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు ఒంటరిగానే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అలాంటి టైమ్​లో వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది రైల్వేశాఖ. అవేంటో మీకు తెలుసా? రైళ్లలో సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా కింద 60 సంవత్సరాలు దాటిన వారు టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే మహిళలకైతే ఈ ఏజ్ లిమిట్ 45 ఏళ్లే. పైగా వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు.

మహిళలకు రైళ్లలో ఉన్న సదుపాయాలు ఏంటో తెలుసా ??

|

Updated on: Jun 22, 2024 | 12:23 PM

ఈరోజుల్లో చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు ఒంటరిగానే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అలాంటి టైమ్​లో వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది రైల్వేశాఖ. అవేంటో మీకు తెలుసా? రైళ్లలో సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా కింద 60 సంవత్సరాలు దాటిన వారు టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే మహిళలకైతే ఈ ఏజ్ లిమిట్ 45 ఏళ్లే. పైగా వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. దీంతో పాటు సీనియర్ సిటిజన్ విభాగంలోనే కాకుండా.. మహిళలందరి కోసం కూడా కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తోంది రైల్వేశాఖ. రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీ ఉంటుంది. అందులో పురుషులకు ప్రవేశం ఉండదు. 12 ఏళ్లలోపు బాలురకు మాత్రమే అనుమతి ఇస్తారు. అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పురుషులు మహిళా కంపార్ట్​మెంట్​లోకి ప్రవేశిస్తే.. మహిళల ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వేశాఖ. 1989 ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం.. మిలటరీ సిబ్బందికి మాత్రమే మహిళల బోగీలోకి ఎంట్రీ ఉంటుంది. ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం.. మహిళా ప్రయాణికులు పొరపాటున టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటే వారిని బయటకు పంపేందుకు టీటీఈకి అనుమతి లేదు. ఫైన్ చెల్లించి ఆ మహిళ తన జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ తను ఆ ఫైన్ చెల్లించలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా టీటీఈకి తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎటువంటి అధికారమూ ఉండదు. ఒకవేళ అలాంటి మహిళను ట్రైన్​లోంచి దిగమని చెప్పాలన్నా.. వారితో మాట్లాడాలన్నా కచ్చితంగా మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఆ పని చేయగలరు. అంతేకాదు.. మహిళల భద్రత కోసం భారత రైల్వే శాఖ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లేకపోతే.. దానిపై ఫిర్యాదు చేసే అధికారం కూడా మహిళలకు ఉందనే విషయాన్ని గమనించాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.90 వేల మామిడిపండుతో దేవుడికి నైవేద్యం

ఈ పొడిని నూనెలో కలిపి రాయండి.. క్షణాల్లో తెల్ల జుట్టు నల్లగా

ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్‌ ఆర్డర్‌.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము

విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

Follow us
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..