చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

Phani CH

|

Updated on: Jun 22, 2024 | 9:26 AM

చిత్రవిచిత్ర సంఘటనలకు కేరాఫ్‌ అడ్రస్‌ చైనా.. తాజాగా అక్కడ యువత వినూత్నంగా నిరసన చేపట్టారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. యువకులంతా పక్షుల తరహాలో దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న ఓ చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి.

చిత్రవిచిత్ర సంఘటనలకు కేరాఫ్‌ అడ్రస్‌ చైనా.. తాజాగా అక్కడ యువత వినూత్నంగా నిరసన చేపట్టారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. యువకులంతా పక్షుల తరహాలో దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న ఓ చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్‌ కల్చర్‌ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన చేస్తున్నవారిలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్నవారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్‌రేస్‌లాంటి వర్క్‌ కల్చర్‌ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. చైనాలోని యువత తమ దేశ పని, సంస్కృతిపై నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్‌ చేశారు. ఎన్‌బీయే బాస్కెట్‌ బాల్‌ వీడియో గేమ్‌లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్‌ బాల్‌ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టార్ నటుడి ఆఫీస్‌లో దొంగలు పడ్డారు.. ఇదిగో వీడియో !!

Love Mouli: అప్పుడే OTTలోకి వస్తోన్న నవదీప్‌ లవ్‌ మౌళి