Love Mouli: అప్పుడే OTTలోకి వస్తోన్న నవదీప్ లవ్ మౌళి
చాలా కాలం తర్వాత టాలీవుడ్ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లవ్ మౌళి. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ సినిమాను తెరకెక్కించాడు. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. ఇక జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. కానీ ఎందుకో లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడలేకపోయింది. దీంతో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
చాలా కాలం తర్వాత టాలీవుడ్ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లవ్ మౌళి. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ సినిమాను తెరకెక్కించాడు. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. ఇక జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. కానీ ఎందుకో లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడలేకపోయింది. దీంతో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లవ్ మౌళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవదీప్ సినిమా స్ట్రీమింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు ఆహా మేకర్స్. త్వరలోనే ఆహా ఓటీటీలో ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. అంతేకాదు సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: డ్రాగన్‌గా వస్తోన్న NTR! | అసెంబ్లీలో తమ్ముడిని చూసి.. అన్న ఎమోషనల్
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

