ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము
బెంగళూర్‌లోని సర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. ప్యాకేజ్ ఓపెన్ చేసిన సాఫ్ట్‌వేర్ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ ప్యాకేజీలో విషపూరిత పాము వచ్చింది. ఆ పామును చూసి జంట కంగుతింది. దీంతో ఈ ఆర్డర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ కపుల్ సోషల్ మీడియాలో పెట్టింది.
బెంగళూర్‌లోని సర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. ప్యాకేజ్ ఓపెన్ చేసిన సాఫ్ట్‌వేర్ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ ప్యాకేజీలో విషపూరిత పాము వచ్చింది. ఆ పామును చూసి జంట కంగుతింది. దీంతో ఈ ఆర్డర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ కపుల్ సోషల్ మీడియాలో పెట్టింది. తమకు ఎదురైన వింత అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేస్తూ.. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో వారికి పాము కనిపించింది. అది విషసర్పం కావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆ పాము టేపునకు అతుక్కొని ఉంది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సపోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పరిస్థితి చెప్పినప్పటికీ రెండు గంటల పాటు వెయిట్ చేయించారని ఆ జంట మండిపడింది. ఆ తర్వాత ఆర్డర్‌కు సంబంధించి నగదు మొత్తం రీఫండ్ చేశారని తెలిపారు. పార్శిల్‌లో విష సర్పం రావడం ఆందోళన కలిగించిందని, తమ భద్రత సంగతి ఏంటని వారు వాపోయారు. అమెజాన్‌లో వస్తువుల నిల్వ చోట సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదా? సరైన రవాణా జరగడం లేదా? అని ఆ జంట మండిపంది. కాగా, ఈ ఘటనపై స్పందించిన అమెజాన్.. ఆ జంటకు క్షమాపణలు చెప్పింది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ ఆర్డర్‌కి సంబంధించి అసలు ఏం జరిగిందో పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అయితే, సేఫ్టీ పై సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆ జంట అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!
చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..