AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: మరణం ఎదురొచ్చిన విడువని స్నేహం.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..

మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా ముగ్గురు మిత్రులు ఒకరికొకరు నిలబడ్డారు. భయంకరమైన వరద ప్రాణం తీసేందుకు కదిలిస్తున్నా ఒకరి చేయి మరొకరు విడువలేదు. అలాంటి వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. అనుకోకుండా వరదలో చిక్కుకున్న ముగ్గురు స్నేహితులు కలిసే ఉన్నారు. మృత్యువును ఆలింగనం చేసుకునే ముందు ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు.

Trending: మరణం ఎదురొచ్చిన విడువని స్నేహం.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..
Trending
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 10:04 AM

Share

స్నేహం చేయడం ఒక గొప్ప అనుభూతి.. ఇప్పుడున్న కాలంలో నిజమైన స్వచ్ఛమైన స్నేహం దొరకడం చాలా కష్టమే. ఆలోచనలు పంచుకుని.. కష్టాలను తెలుసుకునే వెన్నంటే మిత్రుడు ఉండాలంటే అదృష్టం ఉండాలి. నిజానికి స్నేహానికి లింగ విభేదాలు ఉండవు. స్వచ్ఛమైన మనసుతో తోడుగా ఉంటూ మంచిని కోరేవారే స్నేహితులు. అలాంటి స్నేహం కొందరికి మరణంలోనూ వీడిపోదు. మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా ముగ్గురు మిత్రులు ఒకరికొకరు నిలబడ్డారు. భయంకరమైన వరద ప్రాణం తీసేందుకు కదిలిస్తున్నా ఒకరి చేయి మరొకరు విడువలేదు. అలాంటి వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. అనుకోకుండా వరదలో చిక్కుకున్న ముగ్గురు స్నేహితులు కలిసే ఉన్నారు. మృత్యువును ఆలింగనం చేసుకునే ముందు ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెటిజన్స్ కళ్లను చెమర్చుతున్నాయి.

నివేదికల ప్రకారం, ఈ స్నేహితులు నది మధ్యలో ఉన్న బండపై చిక్కుకున్నారు. నీటిలో కొట్టుకుపోకుండా ఉండేందుకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. డైలీ మెయిల్ కథనం ప్రకారం, వారిని 20 ఏళ్ల ప్యాట్రిజియా కోర్మోస్, ఆమె స్నేహితురాలు బియాంకా డోరోస్ (23), ఆమె ప్రియుడు క్రిస్టియన్ మోల్నార్ (25)గా గుర్తించారు. ఈ ముగ్గురూ ‘నదీ సేఫ్టీ జోన్‌కు కొన్ని మీటర్ల దూరంలో’ ఉన్నారని రెస్క్యూ టీమ్ తెలిపింది. వరద ఉధృతి పెరగడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం వెతుకున్నట్లు రెస్క్యూ టీం తెలిపింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నివేదికల ప్రకారం ఈ ముగ్గురు వరదలో చిక్కుకున్నట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది ఓ మహిళ. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ఆ ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో ఇప్పుడు నెటిజన్స్ కంటతడి పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.