విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!
లక్నో నుంచి ముంబై వచ్చేందుకు విమానం ఎక్కిన మహిళ.. తోటి ప్రయాణికులతో గొడవకు దిగింది. అది చూసిన విమాన సిబ్బంది గొడవ పడొద్దని, సైలెంట్‌గా ఉండాలని సూచించడంతో కాసేపు సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆమె గొడవ పెట్టుకోవడంతో .. కేబిన్ క్రూ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆమెను విమానం నుంచి దింపేశారు. విమానం నుంచి దిగుతున్న సమయంలో గ్రౌండ్ సిబ్బందిలో ఒకరిపై దాడిచేసిన మహిళ అతడి మణికట్టును కొరికేసింది.
లక్నో నుంచి ముంబై వచ్చేందుకు విమానం ఎక్కిన మహిళ.. తోటి ప్రయాణికులతో గొడవకు దిగింది. అది చూసిన విమాన సిబ్బంది గొడవ పడొద్దని, సైలెంట్‌గా ఉండాలని సూచించడంతో కాసేపు సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆమె గొడవ పెట్టుకోవడంతో .. కేబిన్ క్రూ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆమెను విమానం నుంచి దింపేశారు. విమానం నుంచి దిగుతున్న సమయంలో గ్రౌండ్ సిబ్బందిలో ఒకరిపై దాడిచేసిన మహిళ అతడి మణికట్టును కొరికేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్ ఆమెను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగ్రాకు చెందిన నిందితురాలు ముంబైలో నివసిస్తోంది. తన సోదరిని కలిసేందుకు లక్నో వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఆమెను బంధువుల ఇంటికి పంపినట్టు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

