పరీక్షల్లో స్టూడెంట్‌ రాసిన జవాబుకు టీచర్‌ షాక్‌

పరీక్షల్లో ఒక్కోసారి విద్యార్థులు సమాధానాలకు బదులు సినిమా స్టోరీలు, పాటలు రాయడం చూస్తూ ఉంటాం. కాని తాజాగా ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని విధులు రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేశాడు. కాని అందులోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.

పరీక్షల్లో స్టూడెంట్‌ రాసిన జవాబుకు టీచర్‌ షాక్‌

|

Updated on: Jun 24, 2024 | 7:21 PM

పరీక్షల్లో ఒక్కోసారి విద్యార్థులు సమాధానాలకు బదులు సినిమా స్టోరీలు, పాటలు రాయడం చూస్తూ ఉంటాం. కాని తాజాగా ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని విధులు రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేశాడు. కాని అందులోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు. అందులోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాయడమే కాదు గుండె విధుల స్థానంలో ఆ అమ్మాయిలు చేసే పనులను వివరించాడు. ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నానని రాశాడు. స్నాప్‌ఛాట్‌ (Snapchat)లో తనతో టచ్‌లో ఉండే రూపకు అందంలో ఎవరూ సాటి రారని ఆమెను ప్రశంసించాడు. పొరుగింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా తన క్లాస్‌మేట్‌ హరితను సైతం ఇష్టపడుతున్నానని పేర్కొన్నాడు. ఆ సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇవ్వచ్చు కదా అంటూ మరో నెటిజన్‌ స్పందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే

తిన్న తిండి అరగడంలేదా.. ఇలా చేయండి

రీల్స్ పిచ్చి తో భవనంపై నుంచి వేల్లాడిన యువతి.. నెట్టింట వీడియో వైరల్

ముఖేశ్ అంబానీ వీడియో వైరల్‌.. మోసపోయిన డాక్టర్

స్పృహ వచ్చి చూసే సరికి అమ్మాయిగా మారిన అబ్బాయి

Follow us