అప్పుడులా కాదు.. ఇప్పుడు ఇంటర్నేషనల్ టబు..

Anil Kumar

19 May 2024

డైరెక్టర్ రాఘవేంద్ర రావు చిత్రీకరించిన వెంకటేష్ కులీనెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది టబు.

టాలీవుడ్ లో ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అప్పుడే బాగా ఫెమస్ అయ్యింది.

తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ వయ్యారి.. తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకుంది.

అక్కడ కూడా వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరో స్టెప్ వెయ్యనుంది.

తాజాగా టబు ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది.. అదే డ్యూన్ ప్రాఫెసీ లో ఛాన్స్ వచ్చింది.

అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'డ్యూన్' వెబ్ సిరీస్‌లో ఇండియన్ హీరోయిన్ టబు కనిపించబోతున్నారు.

డ్యూన్ సిరీస్‌లో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రను పోషించబోతున్నారు టబు.. అయితే దీనిపై అధికారకప్రకటన రాలేదు.

2021లో వచ్చిన డెనిస్ విల్లెనెయువ్స్ డ్యూన్‌కు ఇది ప్రీక్వెల్.. త్వరలోనే దీని చిత్రీకరణ ప్రారంభం కానుంది.