H1B Visa: లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.
అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాయి. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, టెస్లా, వాల్ మార్ట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో తమకు స్వదేశం వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్న హెచ్ 1బీ వీసా టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (USCIS) గుడ్ న్యూస్ చెప్పింది.
అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాయి. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, టెస్లా, వాల్ మార్ట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో తమకు స్వదేశం వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్న హెచ్ 1బీ వీసా టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (USCIS) గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలియజేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా 60 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభించనుంది. అవేంటంటే.. లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులు .. నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును ఫైల్ చేసుకోవచ్చు. లేదా స్టేటస్ లో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. బలవంతపు పరిస్థితుల ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మారేందుకు పిటిషన్ దాఖలు చేసి లబ్ధి పొందవచ్చు. ఇవీ లేఆఫ్స్, ఉద్యోగం కోల్పోయిన వారికి ఉన్న అవకాశాలు.
60 రోజుల గ్రేస్ పీరియడ్‌లోగా ఈ చర్యల్లో ఏదైనా ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. తద్వారా హెచ్1బీ వీసాదారులు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో మరికొంత కాలం ఉండే అవకాశం పొందుతారు. అలాగే అర్హతగల H-1B నాన్ ఇమ్మిగ్రెంట్ లు, కొత్త H-1B పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీలో పనిచేయొచ్చు. అలాగే 180 రోజుల స్టేటస్ పెండింగ్ గడువు తర్వాత వారి స్టేటస్ అప్లికేషన్ ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్ కింద సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుత స్టేటస్ ను డిపెండెంట్ లేదా స్టూడెంట్ లేదా విజిటర్ స్టేటస్ కిందకు కూడా మార్చుకోవచ్చు. దీనివల్ల దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నట్లుగా పరిగణించడాన్ని ఆపొచ్చు. ఇక సెల్ఫ్-పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లు వేసే అర్హత ఉన్న ఉద్యోగులు… స్టేటస్ అప్లికేషన్ సర్దుబాటుతోపాటే ఈ పిటిషన్ ను కూడా ఏకకాలంలో ఫైల్ చేయవచ్చు. దీనివల్ల అలాంటి ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు, ఏడాదిపాటు ఈఏడీని పొందేందుకు వీలవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

