టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..!

Jyothi Gadda

19 May 2024

టమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. ఇందులోని సాల్మొనెల్ల బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టమాటోలను అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు టమాటాలకు దూరంగా ఉంటే మంచిది.

టమోటాలు, వాటి తొక్కలు, విత్తనాలు కూడా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు ఒక కారణం కావచ్చంటున్నారు నిపుణులు.మీకు ఇప్పటికే ఐబిఎస్ ఉంటే టమాలను తీసుకోకపోవడమే మంచిది. ఇవి కడుపు ఉబ్బరాన్ని ఎక్కువ చేస్తాయి

టమాటాలను తిన్న వెంటనే కొంతమందికి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు, తామర, దగ్గు, గొంతులో దురద, ముఖం, నోరు, నాలుక వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుబొమ్మలు, రెప్పల చుట్టూ ఎర్రగా కనిపిస్తుంది. 

మూత్రపిండాల సమస్యలున్నవారు టమోటాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధికి దారితీసే కారకాల్లో ఒకటైన పొటాషియం స్థాయిలను టమోటాలు పెంచుతాయి. 

టమోటాలు అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి అలెర్జీ సమస్యలను పెంచుతాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. టమాటాలు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి.

టమోటాల్లో  అధిక ఆమ్లంగా ఉండటం వల్ల.. మీరు ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడుతుంటే అవి తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తాయి. టమోటాల్లో కడుపులో ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.