07 May 2024
TV9 Telugu
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. దేశంలో పొడవైన ప్లాట్‌ఫారమ్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ బిలాస్‌పూర్ స్టేషన్. దీని పొడవు 802 మీటర్లు. ఈ స్టేషన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది.
పిలిభిత్ జంక్షన్ ప్లాట్ ఫారమ్. దీని పొడవు 900 మీటర్లు. ఈ స్టేషన్‌కు 5 ఫ్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
భారతదేశంలో 5వ పొడవైన ప్లాట్‌ఫారమ్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్. ఈ ప్లాట్ ఫారమ్ 925.22 మీటర్ల పొడవు ఉంది. ఇది ప్రపంచంలోనే 6వ పొడవైనది.
స్టేట్ స్ట్రీట్ సబ్‌వే ప్లాట్ ఫారమ్. దీని పొడవు 1067 మీటర్లు. ఇది చికాగో (యూఎస్)లో ఉంది. ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్‌లలో ఒకటి.
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ పొడవు 1170 మీటర్లు. ఇది పశ్చిమబెంగాల్‌లో ఉంది.
కేరళలో ఉన్న కొల్లం జంక్షన్ ప్లాట్ ఫారమ్. దీని పొడవు 1180 మీటర్లు. భారతదేశంలో పురాతన రైల్వే స్టేషన్‌లలో ఒకటి.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ పొడవు 1366 మీటర్లు. ఉత్తరప్రదేశ్‌లోని ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్ జాబితాలో2వ స్థానంలో ఉంది.
ఇక ప్రపంచంలోనే పొడవైన ప్లాట్‌ఫారమ్ హుబ్బలి రైల్వే స్టేషన్. దీని పొడవు 1505 మీటర్లు. ఇది మార్చి 2023లో ప్రారంభమైంది. ఇది కర్ణాటకలో ఉంది.